- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఖాళీ టీచర్ పోస్టులు భర్తీ చేయాలి.. కలెక్టరేట్ ముందు సీపీఎం ధర్నా
జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని, ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజు డిమాండ్ చేశారు.

దిశ, సంగారెడ్డి అర్బన్: జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని, ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజు డిమాండ్ చేశారు. ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజు దోపిడీని అరికట్టి విద్యను వ్యాపారం చేస్తున్న యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. గురువారం జిల్లా కలెక్టరేట్ ముందు సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి, జిల్లా కలెక్టరేట్ ఏవోకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జయరాజు మాట్లాడుతూ గత 15 రోజులుగా జిల్లా వ్యాప్తంగా అనేక పాఠశాలల్లో సర్వే చేసినట్లు తెలిపారు. సర్వేలో అనేక సమస్యలు వెలుగులోకి వచ్చాయన్నారు. పాఠశాలలు ప్రారంభమై నెలరోజులైనా విద్యార్థులకు పూర్తి స్థాయిలో పుస్తకాలు, యూనిఫామ్స్ అందకపోవడం సరికాదన్నారు.
సమస్యలను తక్షణమే పరిష్కరించాలి..
జిల్లా వ్యాప్తంగా సుమారు 400 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, పటాన్చెరు నియోజకవర్గంలోని పారిశ్రామిక ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలలు లేక చాలామంది విద్యార్థులు విద్యకుదూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనేక పాఠశాలల్లో ప్రహరీ గోడలు, భోజన షెడ్లు, సరిపడా టాయిలెట్లు, కంప్యూటర్లు లేవని తెలిపారు. పాలిటెక్నిక్ కళాశాలల్లో నెలకొన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలన్నారు. విద్యారంగం పట్ల పాలకులు నిర్లక్ష్యంగా ఉన్నారని విమర్శించారు. రాష్ట్ర బడ్జెట్‌లో విద్యకు 10% నిధులు కేటాయించాలని, వలస కార్మికులు ఉన్న ప్రాంతాల్లో హిందీ సబ్జెక్టు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాజయ్య, మానిక్, సాయిలు, నర్సింహులు, జిల్లా కమిటీ సభ్యులు యాదగిరి, కృష్ణ, నాయకులు అశోక్, కె.రాజయ్య, నరసింహారెడ్డి, శ్రీధర్, శంకర్, దత్తు తదితరులు పాల్గొన్నారు.






