సీఎంకు కంటి పరీక్షలు చేయాల్సిందే.. టీఆర్ఎస్ చీఫ్ కవిత హాట్ సెటైర్లు

by Kema Shiva Kumar |

సీఎం రేవంత్ రెడ్డిపై తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత తీవ్ర ఆరోపణ చేశారు.

సీఎంకు కంటి పరీక్షలు చేయాల్సిందే.. టీఆర్ఎస్ చీఫ్ కవిత హాట్ సెటైర్లు
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో ‘హైడ్రా’ (HYDRAA) కూల్చివేతల పర్వం రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రక్షణ సేన చీఫ్, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్‌గా ‘X’ (ట్విట్టర్) వేదికగా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. హైడ్రా అమలులో ప్రభుత్వం ద్వంద్వ వైఖరిని అవలంబిస్తోందని ఆమె మండిపడ్డారు. హైడ్రాను అడ్డం పెట్టుకుని హైదరాబాద్‌లోని నిరుపేదలను రేవంత్ సర్కార్ బుల్డోజర్ల కింద నలిపేస్తోందని ధ్వజమెత్తారు. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీకి చెందిన విద్యాసంస్థలను కాపాడటానికి ఏకంగా కోర్టులను కూడా తప్పుదోవ పట్టిస్తోందని కవిత సంచలన ఆరోపణలు చేశారు.

సీఎంకు కంటి పరీక్ష అవసరం..

ఒవైసీ విద్యాసంస్థల నిర్మాణాలు చెరువులను కబ్జా చేసి కట్టారనే విషయం స్పష్టంగా కనిపిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కల్వకుంట్ల కవిత ఎద్దేవా చేశారు. చెరువును కబ్జా చేసి కట్టిన కాలేజీ ప్రపంచమంతా చూస్తున్నా.. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)కి మాత్రమే కనిపించడం లేదని అన్నారు. దీన్ని బట్టి చూస్తే తక్షణమే ఆయనకు కంటి పరీక్ష చేయించుకోవలసిన అవసరం ఉందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. హైడ్రా పేరుతో పేదల ఇళ్లను కూలుస్తూ, బడాబాబుల ఆక్రమణలను మాత్రం కాపాడుతున్నారని కవిత ప్రభుత్వంపై సోషల్ మీడియా వేదికగా దుమ్మెత్తిపోస్తుండటం స్టేట్ పాలిటిక్స్‌లో చర్చనీయాంశంగా మారింది.

Next Story