- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వైరా నియోజకవర్గానికి గోదావరి జలాలు తీసుకురావడం నా పూర్వజన్మ సుకృతం: ఎమ్మెల్యే
గోదావరి జలాలో ఎమ్మెల్యే, మాలోతు రాందాస్ నాయక్ పసుపు కుంకుమ, చీర సారే వదిలారు.

దిశ, ఏన్కూర్: గోదావరి జలాలను సీతారామ లిఫ్ట్ కెనాల్ ద్వారా వైరా నియోజకవర్గానికి తీసుకురావడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని వైరా ఎమ్మెల్యే మాలోత్ రామదాసు నాయక్ అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని సాగర్ కెనాల్ సమీపంలో గోదావరి జలాలు నాగార్జునసాగర్ కాలువలోకి వదిలిన సందర్భంగా గోదారమ్మకు చీర సారె పసుపు కుంకుమలు వదిలి పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత పాలకులు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి సుమారు 860 కోట్లు ప్రజాధనాన్ని దోచుకున్నారే తప్ప రైతులకు మేలు చేసే ఏ ప్రాజెక్టు నిర్మించలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి ప్రాజెక్టు సీతారామ లిఫ్ట్ కెనాల్ నిర్మాణం జరగడం జరిగిందన్నారు. రైతుల శ్రేయస్సు కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంతో కృషి చేయడం జరుగుతుందన్నారు. ఈ ప్రాంతం గోదావరి జలాలతో కావడం కోసం ఎంతో శ్రమ చేయడం జరిగిందన్నారు. రాష్ట్రంలోనే వైరా నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించేందుకు తన శాయశక్తుల కృషి చేస్తా అన్నారు. ఈ కార్యక్రమంలో నీటిపారుదల శాఖ ఎస్ ఈ, ఎం వెంకటేశ్వరరావు, సీతారామ ప్రాజెక్టు ఎస్ ఈ, శ్రీనివాస్ రెడ్డి, ఈఈ,బాబురావు, డీఈ, చంద్రశేఖర్, ఏన్కూర్ సొసైటీ అధ్యక్షులు శెట్టిపల్లి వెంకటేశ్వరావు, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు, స్వర్ణ నరేందర్, జిల్లా కాంగ్రెస్ నాయకులు, గుత్తా,వెంకటేశ్వరరావు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్, మార్కెట్ కమిటీ చైర్మన్, లచ్చి రామ్ నాయక్, భూక్యా భూక్యాలాలు నాయక్, వివిధ గ్రామాల రైతులు, తదితరులు పాల్గొన్నారు.






