రోడ్డు ప్రమాదంలో యువతి మృతి.. మరొకరికి తీవ్ర గాయాలు

by Kodari Anjali |

గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఐటీ కారిడార్‌లో అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది.

రోడ్డు ప్రమాదంలో యువతి మృతి.. మరొకరికి తీవ్ర గాయాలు
X

దిశ, శేరిలింగంపల్లి: గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఐటీ కారిడార్‌లో అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. గచ్చిబౌలి ఫ్లైఓవర్ వద్ద వేగంగా వచ్చిన వాటర్ ట్యాంకర్ స్కూటర్‌ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఓ యువతి అక్కడికక్కడే మృతి చెందగా.. ఆమె స్నేహితురాలికి తీవ్ర గాయాలయ్యాయి. మృతురాలు గో కలర్స్ షాపులో పనిచేసే మల్లం భవానీ (23)గా గుర్తించారు. తీవ్రంగా గాయపడిన స్నేహితురాలు సుభాషిణి (30) పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన యువతిని చికిత్స నిమిత్తం గచ్చిబౌలిలోని హిమగిరి ఆసుపత్రికి తరలించారు. గచ్చిబౌలి ఐఐఐటీ వైపు నుంచి అంజయ్యనగర్ వెళ్తుండగా, దూసుకొచ్చిన ట్యాంకర్.. అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా పోలీసులు నిర్ధారించారు. ఈ ప్రమాద ధాటికి హీరో హోండా యాక్టివా పూర్తిగా ధ్వంసం అయ్యింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన గచ్చిబౌలి ఇన్స్పెక్టర్ బాలరాజు తెలిపారు.

Next Story