రావణ్‌కు మద్దతుగా విపక్షాలు.. సంచలన డిమాండ్

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-07-10 09:02:13  IST  )

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో పాటు హిందువులను కించపరుస్తూ మాట్లాడిన బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ ప్రశ్న రావణ్‌కు విపక్షాలు మద్దతుగా నిలిచాయి...

రావణ్‌కు మద్దతుగా విపక్షాలు.. సంచలన డిమాండ్
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌( Ap Deputy Cm Pawan Kalyan)తో పాటు హిందువులను కించపరుస్తూ మాట్లాడిన బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ ప్రశ్న రావణ్‌(Prashna Ravan)కు విపక్షాలు మద్దతుగా నిలిచాయి. రావణ్‌పై UAPA కేసు పెట్టడాన్ని తీవ్రంగా ఖండించాయి. విజయవాడ(Vijayawada)లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో వైసీపీ(Ycp) నేతలతో పాటు సీపీఐ, సీపీఎం పార్టీ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్బంగా సీపీఐ నారాయణ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమస్యల్లో చిక్కుకున్నాయన్నారు. ప్రజలను డైవర్ట్ చేసేందుకే రావణ్‌పై రాజకీయ కుట్ర జరుగుతోందని ఆరోపించారు. రావణ్‌పై నమోదు చేసిన ఉపా కేసును వెంటనే ఉపసంహరించుకోవాలని సీపీఐ నారాయణ డిమాండ్ చేశారు.

రావణ్‌పై అక్రమంగా ఉపా కేసు

వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ రావణ్‌పై అక్రమంగా ఉపా కేసు నమోదు చేశారని మండిపడ్డారు. రావణ్ అణచివేసేందుకే ఉపా కేసు పెట్టారని తెలిపారు. ఉపా కేసును తక్షణమే వెనక్కి తీసుకోవాలని అంబటి డిమాండ్ చేశారు.

Next Story