ఇందిరమ్మ బిల్లులు అందేనా...?

by Ratna Kumari |   (  Updated:2026-07-10 10:28:17  IST  )

నిరుపేదల సొంతింటి కల నెరవేర్చాలనే సదాశయం తో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతగా అమలు చేస్తున్న ఇందిరమ్మ' ఇండ్ల పథకం లబ్ధిదారులు గత మూడు నెలలుగా బిల్లులు అందకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ఇందిరమ్మ బిల్లులు అందేనా...?
X

దిశ. లింగంపేట : నిరుపేదల సొంతింటి కల నెరవేర్చాలనే సదాశయం తో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతగా అమలు చేస్తున్న ఇందిరమ్మ' ఇండ్ల పథకం లబ్ధిదారులు గత మూడు నెలలుగా బిల్లులు అందకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కామారెడ్డి జిల్లాలో ని జుక్కల్, బాన్సువాడ, ఎల్లారెడ్డి, కామారెడ్డి నియో జకవర్గాలలోని నిరుపేద లకు మొదటి విడత గా 11,615 ఇందిరమ్మ ఇండ్ల ను మంజూరు చేశారు. వీటిలో10, 557 ఇండ్ల నిర్మాణ పనులను అధికా రులు ప్రారం భించారు. 6205 ఇండ్లు స్లాబ్ లెవెల్ వరకు పూర్తవ గా, 3200 ల ఇండ్లు పూర్తిగా నిర్మిత మయ్యాయి. ఇందిర మ్మ ఇండ్లు మంజూరైన లబ్ధిదారులకు నాలుగు విడుతలు గా రూ. ఐదు లక్షలు చెల్లిస్తామని ప్రభు త్వం ప్రకటించింది. బేస్మెంట్ పూర్తి అయితే రూ. ఒక లక్ష, రూప్ లెవెల్ వరకు నిర్మాణం పూర్తయితే రూ. మరో లక్ష, స్లాబ్ లెవెల్ నిర్మాణం పూర్తయితే రూ. రెండు లక్షలు, ఇల్లు ప్లాస్ట రింగ్ పనులు పూర్తయితే చివరి విడతగా లక్ష రూపాయలు అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దాంతో జిల్లా వ్యాప్తంగా ఉన్న ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు ఎంత ఉత్సా హంగా గృహ నిర్మాణ పను లు ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం సైతం ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారులకు బేస్మెంట్ స్థాయి నుంచి స్లాబ్ దశ వరకు వెంట వెంటనే బిల్లును చెల్లిం చింది. ఇందిరమ్మ ఇండ్ల స్లాబ్ ల నిర్మాణం పూర్త యిన లబ్ధిదారులకు రూ. రెండు లక్షలు చెల్లించాల్సి ఉండగా రాష్ట్ర ప్రభుత్వం కేవలం రూ. లక్ష నలభై వేలు మాత్రమే చెల్లించింది. మిగతా 60 వేల రూపాయ లను లేబర్ కాంపోనెంట్ కింద ఉపాధి హామీ పథకం నిధులను ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణా లు చేపట్టిన లబ్ధిదారులు వందరోజుల పని దినాలు పూర్తయితేనే వారి ఖాతా ల్లో డబ్బులు జమవుతు న్నాయి. స్లాబ్ నిర్మాణ పనులు పూర్తయి మూడు నెలలు గడిచే వరకు లబ్ధి దారులకు డబ్బులు రావ డం లేదు. దాంతో జిల్లా వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు అప్పులు చేసి పనులను కొనసాగిస్తున్నా రు. కొందరు నిరుపేదలు అప్పులు దొరక్క పోవడం తో గృహ నిర్మాణ పనుల ను కొనసాగించడం లేదు.

మూడు నెలలుగా బిల్లుల కోసం నిరీక్షణ..

ఇందిరమ్మ ఇండ్ల నిర్మా ణాలు పూర్తి చేసుకున్న లబ్ధిదారులు మూడు నెలలుగా బిల్లుల కోసం నిరీక్షిస్తున్నారు. జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో సుమారుగా 3200కు పైగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు పూర్తయ్యాయి. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో అత్యధికంగా 2వేలకు పైగా ఇండ్ల నిర్మాణాలు కంప్లీట్ అయ్యాయి.గృహనిర్మా ణాలు పూర్తి చేసుకున్న లబ్ధిదారులు గృహప్రవే శాలను సైతం పూర్తి చేసు కున్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఫైనల్ బిల్లులను చెల్లించడంలో జాప్యం చేస్తుండడంతో లబ్ధిదా రులు తీవ్ర ఆందోళనలకు గురవుతున్నారు. ఇండ్ల నిర్మాణాల కోసం చేసిన అప్పులకు వడ్డీలు పెరిగి పోతున్నాయని, జిల్లాలోని ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్ స్పందించి ఇందిరమ్మ ఇండ్ల బిల్లులను ఇప్పించాలని లబ్ధిదారులు కోరుతున్నా రు. రాష్ట్రాన్ని పదేళ్లు పాలించిన బీ ఆర్ఎస్ ప్రభుత్వంలో నిరుపేదలకు ఒక్క ఇల్లు మంజూరు చేయలేదని, కాంగ్రెస్ ప్రభు త్వం అధికారం చేపట్టిన తర్వాత నిరుపేదల 'సొంతింటి కల' నెర వేరనుందనే రెట్టింపు ఉత్సాహంతో అప్పులు చేసి గృహ నిర్మాణాలను పూర్తి చేసుకున్నా మని లబ్ధిదారులు చెప్పారు. ఇకనైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పందించి రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందు లు ఎన్ని ఉన్నా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు సకా లంలో బిల్లులు అందేలా చర్యలు తీసుకోవాలని లబ్ధిదారులు కోరుతున్నా రు.

బిల్లులను సకాలంలో చెల్లించాలి..

పెద్ద పట్లోళ్ల సమత, మాసన్ పల్లి గ్రామం, నాగిరెడ్డిపేట మండలం

ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న మా సొంతింటి కల నెరవేరింది.ఇందిరమ్మ ఇంటి నిర్మాణం పూర్తి చేసుకుని మూడు నెలలు గడిచింది. మాకు ఫైనల్ బిల్లు రాలేదు. బిల్లు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో బిల్లులను అందించి ఆదు కోవాలి. ఫైనల్ బిల్లు కోసం ఎదురు చూస్తున్నాం

లింగం స్వరూప, మెంగారం, లింగంపేట మండలం.

ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులు పూర్తయి మూడు నెలలు గడుస్తుంది. అయినా మాకు ఫైనల్ బిల్లు రాలేదు. ఇందిరమ్మ ఇంటి నిర్మాణంతో సొంతింటి కల నెరవేరింది అనే సంతోషంతో ఉన్న మాకు ఫైనల్ బిల్లు రాకపోవడం నిరాశకు గురిచేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం అందించే రూ. ఐదు లక్షలు సరిపడక పోవడంతో అప్పుచేసి ఇల్లు కట్టుకున్నాం.కానీ ఫైనల్ బిల్లు అందకపోవడంతో మాకు వడ్డీ భారమవుతోంది. సంబంధిత శాఖ అధికారులు స్పందించి మాకు సకాలంలో బిల్లులు ఇప్పించాలి.

టెక్నికల్ ప్రాబ్లంతో బిల్లులు ఆగాయి... త్వరలోనే చెల్లిస్తాం..

విజయ్ పాల్ రెడ్డి. హౌసింగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ కామారెడ్డి

జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు బిల్లులు అందక ఇబ్బందులు పడుతున్న అంశంపై గృహ నిర్మాణ శాఖ జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ విజయపాల్ రెడ్డిని దిశ ప్రశ్నించగా టెక్నికల్ ప్రాబ్లం వల్ల బిల్లులు ఆగాయని, లబ్ధిదారులకు త్వరలోనే బిల్లుల చెల్లిస్తామని ఆయన చెప్పారు.

Next Story