మెగా ప్రిన్స్ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్.. కనకరాజు వచ్చేస్తున్నాడమ్మీ అంటూ సరికొత్త పోస్టర్ రిలీజ్

by Chukka Sudharani |

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కొరియన్ కనకరాజు’ రిలీజ్ డేట్ ఫిక్స్ చేస్తూ అఫీషియల్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్.

మెగా ప్రిన్స్ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్.. కనకరాజు వచ్చేస్తున్నాడమ్మీ అంటూ సరికొత్త పోస్టర్ రిలీజ్
X

దిశ, సినిమా: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా వస్తున్న లేటెస్ట్ లవ్ ఎంటర్‌టైనింగ్ ‘కొరియన్ కనకరాజు’. ఈ సినిమాను మేర్లపాక గాంధీ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్మెంట్ సంయుక్తంగా నర్మిస్తున్నాయి. కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ మూవీపై వరుణ్‌తో పాటు ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. అలాగే ఎక్స్‌పెక్టేషన్స్‌కు రీచ్ అయ్యేలా మేకర్స్ సైతం ప్రమోషన్స్ గట్టిగా ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే ఈ సినిమా నుంచి వదిలిన ప్రతి అప్డేట్ టీజర్, ట్రైలర్, సాంగ్స్, లుక్ పోస్టర్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇప్పుడు అదే జోష్‌తో తాజాగా ‘కొరియన్ కనకరాజు’ రిలీజ్ డేట్ అప్డే్ట్ ఇచ్చారు మేకర్స్. ‘కనకరాజు వచ్చేస్తున్నాడమ్మీ... ‘కొరియన్ కనకరాజు’తో ఈ ఏడాది అత్యంత ఉత్కంఠభరితమైన ఇండో-కొరియన్ హారర్ కామెడీ అనుభూతికి సిద్ధంగా ఉండండి.. KOKA ఆగస్టు 7, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ఘనంగా విడుదల కానుంది’ అంటూ ఓ సరికొత్త పోస్టర్‌ను రిలీజ్ చేసి మెగాఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ చేశారు మేకర్స్.

Next Story