- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భారత ఆర్థిక వ్యవస్థకు సరికొత్త ఊపు.. రికార్డు స్థాయికి దేశ విదేశీ మారక నిల్వలు
భారత ఫారెక్స్ నిల్వలు 7.26 బిలియన్ డాలర్లు జంప్.. 674.19 బిలియన్ డాలర్ల సరికొత్త రికార్డు స్థాయికి చేరినట్లు ప్రకటించిన ఆర్బీఐ!

దిశ, వెబ్ డెస్క్: భారత ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేలా దేశ విదేశీ మారక నిల్వలు (Foreign Exchange Reserves) మరోసారి భారీగా పెరిగాయి. జూలై 3 తో ముగిసిన వారానికి గాను దేశ ఫారెక్స్ నిల్వలు ఏకంగా 7.26 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 60,600 కోట్లు) పెరిగి, మొత్తంగా 674.19 బిలియన్ డాలర్ల రికార్డు స్థాయికి చేరుకున్నాయని భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) శుక్రవారం వెల్లడించింది. అంతర్జాతీయ మార్కెట్‌లో చోటుచేసుకున్న సానుకూల పరిణామాలు, దేశీయ మార్కెట్లలోకి విదేశీ పెట్టుబడులు (FIIs) భారీగా తరలిరావడమే ఈ వృద్ధికి ప్రధాన కారణమని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.
ఆర్బీఐ నివేదికలోని ముఖ్యాంశాలు..
రిజర్వ్ బ్యాంక్ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. ఫారెక్స్ నిల్వల్లో అత్యంత కీలకమైన విదేశీ కరెన్సీ ఆస్తులు (FCA) ఈ వారంలో 6.13 బిలియన్ డాలర్లు పెరిగి 591.56 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. అదే విధంగా దేశంలోని బంగారు నిల్వల (Gold Reserves) విలువ కూడా 1.05 బిలియన్ డాలర్లు వృద్ధి చెంది 60.15 బిలియన్ డాలర్ల మార్కును తాకింది. అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) వద్ద ఉన్న ప్రత్యేక డ్రాయింగ్ హక్కులు (SDRs) కూడా స్వల్పంగా పెరిగాయి. ఈ భారీ నిల్వల వల్ల అంతర్జాతీయంగా రూపాయి విలువ స్థిరంగా ఉండటం తో పాటు, ఎలాంటి ప్రపంచ ఆర్థిక సంక్షోభాలనైనా తట్టుకునే పటిష్టమైన స్థితికి భారతదేశం చేరుకుందని ఆర్బీఐ వర్గాలు తెలిపాయి.






