- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏపీ కేబినెట్ భేటీలో కీలక పరిణామం.. పవన్ కల్యాణ్ సహా ఐదుగురు మంత్రుల డుమ్మా
ఏపీ కేబినెట్ భేటీకి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో పాటు మరో నలుగురు మంత్రులు గైర్హాజరయ్యారు. పవన్ కల్యాణ్ అనారోగ్య కారణాల రీత్యా వైద్య పరీక్షల కోసం ముంబై వెళ్తున్నారు.

దిశ, వెబ్ డెస్క్: ఏపీ కేబినెట్(Ap Cabinet) భేటీకి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Deputy Cm Pawan Kalyan)తో పాటు మరో నలుగురు మంత్రులు గైర్హాజరయ్యారు. పవన్ కల్యాణ్(Pawan Kalyan) అనారోగ్య కారణాల రీత్యా వైద్య పరీక్షల కోసం ముంబై(Mumbai) వెళ్తున్నారు. దీంతో ఆయన ఈ భేటీకి రాలేకపోయారని జనసేన వర్గాలు వెల్లడించాయి. గతంలో జరిగిన రెండు కేబినెట్ సమావేశాల నుంచి కూడా ఆయన మధ్యలోనే వెళ్ళిపోవడం గమనార్హం. మరోవైపు మిగిలిన నలుగురు మంత్రులు వివిధ అధికారిక పర్యటనలు, కార్యక్రమాల వల్ల ఈ సమావేశానికి హాజరుకాలేకపోయారు. మంత్రి నారా లోకేష్(Minsiter Nara Lokesh) ప్రస్తుతం కొరియా పర్యటనలో ఉన్నారు. మంత్రి టి.జి. భరత్(Minsiter TG Bharat) అమెరికా(America) పర్యటనలో ఉన్నారు. అలాగే జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు(Nimmala Ramanaidu) బెంగళూరు పర్యటనలో నిమగ్నమయ్యారు. ఇక తిరుపతి(Tirupati)కి కేంద్ర మంత్రి వస్తుండటంతో ప్రొటోకాల్ బాధ్యతల నిర్వహణ కోసం మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అక్కడకు వెళ్లారు. ఇలా వేర్వేరు ముందస్తు షెడ్యూళ్లు, వ్యక్తిగత కారణాలతో మొత్తం ఐదుగురు మంత్రులు కేబినెట్ సమావేశానికి దూరంగా ఉండాల్సి వచ్చింది.






