బిడ్డ దగ్గరికి వచ్చి, అనంతలోకాలకు తండ్రి

by velandi.Saikiran |

రోడ్డు ప్రమాదంలో పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం మడక గ్రామానికి చెందిన దాస రాజు అనే వ్యక్తి స్పాట్ లోనే మృతి చెందాడు.

బిడ్డ దగ్గరికి వచ్చి, అనంతలోకాలకు తండ్రి
X

దిశ, వెల్గటూర్: ఎండపల్లి మండల కేంద్రంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం మడక గ్రామానికి చెందిన దాస రాజు అనే వ్యక్తి స్పాట్ లోనే మృతి చెందాడు. రాజు ఈ ప్రాంతంలోనే ఉన్న తన కూతురు దగ్గరకు వెళ్లి సాయంత్రం స్వగ్రామానికి తిరిగి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనం పై ధర్మారం వైపు వెళ్తున్న రాజును ఎండపల్లి పెట్రోల్ బంక్ వద్ద ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో తల పగిలి రాజు స్పాట్ లోనే దారుణంగా మృతి చెందాడు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృత దేహాన్ని స్వాదీనం చేసుకొని రోడ్డు క్లియర్ చేశారు.

Next Story