- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఢిల్లీ రాజకీయాల్లో సంచలనం.. బీజేపీలో చేరిన 16 మంది ఎంసీడీ కౌన్సిలర్లు!
ఢిల్లీలో ఆప్‌కు షాక్.. ఇంద్రప్రస్థ వికాస్ పార్టీకి చెందిన 16 మంది కౌన్సిలర్లు సీఎం రేఖా గుప్తా సమక్షంలో బీజేపీలోకి చేరారు.

దిశ, వెబ్ డెస్క్: మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ (MCD) స్టాండింగ్ కమిటీ ఖాళీ స్థానాల ఎన్నికలకు ముందు ఢిల్లీ రాజకీయం అనూహ్య మలుపు తిరిగింది. ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) లోని అంతర్గత విభేదాల కారణంగా గత ఏడాది ఆ పార్టీని వీడి, కొత్తగా ‘ఇంద్రప్రస్థ వికాస్ పార్టీ’ని స్థాపించిన 16 మంది మున్సిపల్ కౌన్సిలర్లు శుక్రవారం అధికారికంగా భారతీయ జనతా పార్టీ (BJP) లో చేరారు. ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా, ఢిల్లీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు హర్ష్ మల్హోత్రా సమక్షంలో వీరంతా కాషాయ తీర్థం పుచ్చుకున్నారు.
బీజేపీ గూటికి ఆప్ తిరుగుబాటు కౌన్సిలర్లు..
బీజేపీలో చేరిన ఈ 16 మంది కౌన్సిలర్లలో ఇంద్రప్రస్థ వికాస్ పార్టీ వ్యవస్థాపకుడు, సీనియర్ నేత ముఖేష్ గోయల్ కూడా ఉన్నారు. గత ఏడాది మే 18న ఆమ్ ఆద్మీ పార్టీలో నెలకొన్న తీవ్ర అంతర్గత విభేదాల కారణంగా ముఖేష్ గోయల్, హిమానీ జైన్ నాయకత్వంలో 15 మంది కౌన్సిలర్లు ఆప్‌కు రాజీనామా చేసి, ఢిల్లీ అభివృద్ధి ధ్యేయంగా ‘ఇంద్రప్రస్థ వికాస్ పార్టీ’ని ఏర్పాటు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సుపరిపాలన, అలాగే సీఎం రేఖా గుప్తా నేతృత్వంలోని ఢిల్లీ ప్రభుత్వం, ఎంసీడీలు చేపడుతున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులమై తాము బీజేపీలో చేరుతున్నట్లు ఈ సందర్భంగా కౌన్సిలర్లు ప్రకటించారు. ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు హర్ష్ మల్హోత్రా వారికి పార్టీ కండువాలు కప్పి బీజేపీ కుటుంబంలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ 16 మంది చేరికతో మున్సిపల్ కార్పొరేషన్‌లో బీజేపీ బలం మరింత పెరిగిందని, ప్రజా సేవకు మరింత శక్తి లభించిందని పార్టీ అధిష్టానం ధీమా వ్యక్తం చేసింది.






