ఆదాయం లక్షలలో..అభివృద్ధి పాతాళంలో

by velandi.Saikiran |

చెన్నకేశవ స్వామి దేవస్థానంకు 30 ఎకరాల భూమి ఉన్నా, స్వామివారికి ధూప దీప నైవేధ్యం నోచుకోవడం లేదని గ్రామస్తులు ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.

ఆదాయం లక్షలలో..అభివృద్ధి పాతాళంలో
X

దిశ, వీపనగండ్ల: వీపనగండ్ల మండలం కేంద్రం చెన్నకేశవ స్వామి దేవస్థానంకు 30 ఎకరాల భూమి ఉన్నా, స్వామివారికి ధూప దీప నైవేధ్యం నోచుకోవడం లేదని గ్రామస్తులు ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ఆ భూమిని ఒకే కుటుంబానికి చెందినవారు దాదాపు చాలా సంవత్సరాల నుండి సాగు చేస్తున్నా గుడికి ఒక్క‌ రూపాయి కూడా ఇవ్వడం లేదని తీన్మార్ మల్లన్నకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ ఒకే కుటుంబం చాలా సంవత్సరాల నుండి దేవుని మాన్యం సాగు చేయడం వలన గుడికి ఆదాయం లేకపోయింద‌న్నారు. ఉన్నత వర్గానికి చెందినవారు దేవుని భూమికి వేలం పాట నిర్వహించకుండా సాగు చేసుకుంటున్నారని గ్రామస్తులు తెలిపారు. ప్రజలు ఉద్యమించక ముందే జిల్లా ఎండోమెంట్ అధికారులు భూమికి వేలంపాట నిర్వహించాలని వివిధ పార్టీల నాయకులు కోరారు.

Next Story