తుంగతుర్తి రాజకీయాలపై కాంగ్రెస్ ఫోకస్

by Malleboina Mahesh |

తుంగతుర్తి నియోజకవర్గంలో ఇటీవల చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దృష్టి సారించింది.

తుంగతుర్తి రాజకీయాలపై కాంగ్రెస్ ఫోకస్
X

దిశ, తెలంగాణ బ్యూరో : సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో ఇటీవల చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దృష్టి సారించింది. ఈ క్రమంలో నియోజకవర్గ ముఖ్య నేతలందరితో ఇవాళ హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో కీలక సమావేశం నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి తెలిపారు. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు ఈ భేటీని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. నియోజకవర్గంలోని రాజకీయ పరిస్థితులపై పార్టీ పరంగా చర్చించి, తదుపరి కార్యాచరణను ఖరారు చేస్తామన్నారు. ఈ భేటీకి తుంగతుర్తి ఎమ్మెల్యే, ఎంపీ, జిల్లా మంత్రులతో పాటు నియోజకవర్గంలోని ముఖ్య నాయకులందరూ హాజరు కావాలని సూచించినట్లు జగ్గారెడ్డి తెలిపారు.

Next Story