- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అమరావతిలో చంద్రబాబు పర్యటన.. అధికారులకు కీలక ఆదేశాలు
రాష్ట్ర రాజధాని అమరావతిని అంతర్జాతీయ ప్రమాణాలతో పునర్నిర్మించాలనే పట్టుదలతో సీఎం చంద్రబాబు నాయుడు సేవలందిస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా అమరావతి రాజధాని ప్రాంతంలో ఆయన సుడిగాలి పర్యటన చేశారు..

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్ర రాజధాని అమరావతి(Amaravati)ని అంతర్జాతీయ ప్రమాణాలతో పునర్నిర్మించాలనే పట్టుదలతో సీఎం చంద్రబాబు నాయుడు సేవలందిస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా అమరావతి రాజధాని ప్రాంతంలో ఆయన సుడిగాలి పర్యటన చేశారు. రాజధాని పనులు, వివిధ ప్రతిపాదిత భవన నిర్మాణాలను ఆయన పరిశీలించారు. క్షేత్రస్థాయిలో ఉన్న వనరులు, ప్రస్తుత పరిస్థితిని అంచనా వేశారు. అంతేకాదు న్యాయమూర్తుల నివాస సముదాయాలు, ఎన్జీవోల భవన నిర్మాణాల పురోగతిపై చంద్రబాబు ప్రత్యేకంగా సమీక్షించారు. పనులు ఏ దశలో ఉన్నాయని, పూర్తి కావడానికి ఎంత సమయం పడుతుందనే వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎక్కడా జాప్యం జరగకుండా, నాణ్యతా ప్రమాణాలతో పనులను వీలైనంత త్వరగా ముందుకు తీసుకెళ్లాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు.
సొంత నివాస భవనాన్ని సందర్శించిన సీఎం దంపతులు
మరోవైపు అమరావతిలో కొత్తగా నిర్మిస్తున్న తమ సొంత నివాస భవనాన్ని సైతం చంద్రబాబు దంపతులు సందర్శించారు. భవన నిర్మాణ పనుల శైలిని, పురోగతిని నిశితంగా పరిశీలించారు. రాజధాని ప్రాంతంలోని పనులన్నీ అనుకున్న సమయానికి పూర్తి కావాలని, నిరంతరం శ్రమించాలని అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు.






