బీఆర్ఎస్ వ‌ర్సెస్ కాంగ్రెస్..సర్పంచుల మధ్య తీవ్ర వాగ్వాదం

by velandi.Saikiran |

బీఆర్ఎస్, కాంగ్రెస్ గ్రామ సర్పంచుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిన సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకుంది.

బీఆర్ఎస్ వ‌ర్సెస్ కాంగ్రెస్..సర్పంచుల మధ్య తీవ్ర వాగ్వాదం
X

దిశ ప్రతినిధి, రాజన్న సిరిసిల్ల: బీఆర్ఎస్, కాంగ్రెస్ గ్రామ సర్పంచుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిన సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో సర్పంచ్ లు, కార్యదర్శులకుశుక్రవారం శిక్షణ తరగతులను నిర్వహించారు అధికారులు. ఈ కార్యక్రమంలో మాట్లాడుతున్న క్రమంలో సర్పంచ్ ల మధ్య మాటల యుద్ధం జరిగింది. ప్రభుత్వం విడుదల చేసే నిధుల విషయంలో ఇరు వర్గాల సర్పంచులు పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు. గ్రామాల్లో కేంద్రం విడుదల చేసిన నిధులతోనే పనులు జరుగుతున్నాయి అంటూ కొంతమంది , గత ప్రభుత్వం లో చేసిన పనులకు ఇంకా బిల్లు రాలేదంటూ మాజీ సర్పంచులు తమ వద్దకు వస్తున్నారంటు మరికొంత మంది సర్పంచులు వాద ప్రతి వాదనలు చేశారు. దీంతో కొద్దిసేపు కార్యక్రమంలో గందరగోళ పరిస్థితి ఏర్పంది.

Next Story