- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మెదక్ పల్లిలో ఆకా సెంటర్ ప్రారంభించిన ఎమ్మెల్యే...
మెదక్‌పల్లి గ్రామంలో రైతుల సౌకర్యార్థం నూతనంగా ఏర్పాటు చేసిన సీడ్స్ అండ్ పెస్టిసైడ్స్ ఆకా సెంటర్‌ను కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి స్థానిక నేతలతో కలిసి ప్రారంభించారు.

దిశ,తలకొండపల్లి : మెదక్‌పల్లి గ్రామంలో రైతుల సౌకర్యార్థం నూతనంగా ఏర్పాటు చేసిన సీడ్స్ అండ్ పెస్టిసైడ్స్ ఆకా సెంటర్‌ను కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి స్థానిక నేతలతో కలిసి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ.. రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు స్థానికంగానే అందుబాటులో ఉండటం వల్ల వ్యవసాయానికి ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు. రైతులకు ఈ ఆకా సెంటర్ అన్ని వేళలా ఉపయోగపడేలా నిర్వహించాలని నిర్వాహకులకు సూచించారు. అనంతరం గ్రామంలోని ప్రత్యేక ఎన్యుమరేషన్ (బీఎల్ఓ) కేంద్రాన్ని ఎమ్మెల్యే పరిశీలించారు.ఈ సందర్భంగా ఆకాశ సెంటర్ ను ప్రారంభించడానికి హాజరైన ఎమ్మెల్యేను నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. ఓటరు జాబితా డిజిటలైజేషన్, నమోదు, సవరణ ప్రక్రియను స్వయంగా పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. తలకొండపల్లి తహసీల్దార్ రమేష్‌తో మాట్లాడి ప్రతి బూత్‌కు అవసరమైన సిబ్బందిని ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే ఎంఈవో చంపా నాయక్‌తో కూడా ఫోన్‌లో మాట్లాడి ఈరోజే ఉపాధ్యాయులను నియమించి, రేపటి ఉదయం నుంచే ఎన్యుమరేషన్ ప్రక్రియ సజావుగా కొనసాగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఓటు ప్రతి పౌరుడి రాజ్యాంగబద్ధమైన హక్కు
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... ప్రతి ఒక్కరూ ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని తమ ఓటు హక్కును పరిరక్షించుకోవాలని కోరారు. ఓటు అనేది ప్రతి పౌరుడి రాజ్యాంగబద్ధమైన హక్కు అని, నిర్లక్ష్యం చేయకుండా పేరు నమోదు, మార్పులు, చేర్పులు పూర్తిచేసుకోవాలని సూచించారు. కల్వకుర్తి నియోజకవర్గంలో గురువారం వరకు 13.6 శాతం మేర ప్రక్రియ పూర్తయిందని, వచ్చే పది రోజుల్లో పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతి బూత్‌కు ఒక ఉపాధ్యాయుడిని సహాయకుడిగా నియమించి డిజిటలైజేషన్‌ను వేగవంతం చేస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు యట నరసింహ, ఆమనగల్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ భాస్కర్ రెడ్డి ,తలకొండపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాసు. శ్రీనివాస్ రెడ్డి, స్థానిక సర్పంచ్ రమేష్, ఆయా గ్రామాల సర్పంచ్ లు రామ్ లక్ష్మణ్,రాజు,భాగ్యమ్మ, బ్లాక్ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు రమాదేవి, నాయకులు భగవాన్ రెడ్డి, మాజీ ఎంపీపీ రఘురాములు, కసిరెడ్డి విజేందర్ రెడ్డి, నరేందర్ గౌడ్, అవంచ నర్సింహారెడ్డి, శ్రీశైలం, మెరిగే గోపాల్ , రాజేందర్ నాయక్, రేణు రెడ్డి డేవి, రాములు,అజీమ్, కృష్ణ, గ్రామ నాయకులు మహిళలు తదితరులు పాల్గొన్నారు.






