టీమిండియా వరుస ఓటములపై భారత మాజీ కెప్టెన్ అజారుద్దీన్ కీలక వ్యాఖ్యలు

by Malleboina Mahesh |

భారత జట్టు ఐర్లాండ్, ఇంగ్లాండ్ జట్లతో వరుసగా ఐదు మ్యాచులో ఓడిపోవడంపై భారత మాజీ కెప్టెన్ అజారుద్దీన్ అసంతృప్తిని వ్యక్తం చేశారు.

టీమిండియా వరుస ఓటములపై భారత మాజీ కెప్టెన్ అజారుద్దీన్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: ఇంగ్లాండ్‌తో పర్యటనో ఉన్న భారత జట్టుకు వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత క్రికెట్ జట్టు వరుసగా మూడో ఓటమితో సిరీస్ ను చేజార్చుకుంది. కాగా వరుస ఓటములపై మాజీ భారత కెప్టెన్, తెలంగాణ మంత్రి మహ్మద్ అజారుద్దీన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఐపీఎల్ (IPL) మైండ్ సెట్ నుండి భారత బ్యాటర్లు ఎంత త్వరగా బయట పడితే అంత మంచిదని అన్నారు. ఇంగ్లాండ్‌లో ఆడటం అనేది పూర్తిగా భిన్నమైన విషయమని, ఐపీఎల్‌లో ఆడినట్లు ప్రతి బంతిని స్టేడియం దాటించడానికి ఇక్కడ కుదరదని స్పష్టం చేశారు. అక్కడ వాతావరణ పరిస్థితులతో పాటు పిచ్‌లపై బంతి బాగా స్వింగ్, బౌన్స్ అవుతుందని, మన బ్యాటర్ల బలహీనతలను ఇంగ్లాండ్ బౌలర్లు పక్కాగా పసిగట్టారని ఆయన విశ్లేషించారు.

ముందుగా ఐర్లాండ్‌పై రెండు మ్యాచ్‌లు, ఆ తర్వాత ఇంగ్లండ్‌పై వరుసగా మూడు మ్యాచ్‌ల్లో పరాజయం పాలుకావడం టీమిండియా ప్రతిష్టకు మంచిది కాదని అజారుద్దీన్ పేర్కొన్నారు. ఈ ఐదు వరుస ఓటములు జట్టుకు శుభసూచకం కాదన్న ఆయన.. ఆటగాళ్లు తమ తప్పుల నుండి త్వరగా నేర్చుకోవాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. సిరీస్ ఎలాగో చేజారిపోయినందున, కనీసం మిగిలిన ఒక్క మ్యాచ్‌ల్లోనైనా ఆత్మగౌరవం కోసం పోరాడి గెలవాలని భారత జట్టుకు ఆయన సూచించారు.

Next Story