- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హైకోర్టులో యూట్యూబర్ రావణ్ కస్టడీ పిటిషన్.. విచారణ వాయిదా
యూట్యూబర్ రావణ్ కస్టడీ పిటిషన్‌పై కోర్టులో విచారణ ఈ నెల 14వ తేదీకి వాయిదా పడింది. రావణ్‌ను విచారించేందుకు తమకు 10 రోజుల పాటు పోలీస్ కస్టడీకి అప్పగించాలని గన్నవరం పోలీసులు న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు....

దిశ, వెబ్ డెస్క్: యూట్యూబర్ రావణ్ కస్టడీ పిటిషన్‌పై కోర్టులో విచారణ ఈ నెల 14వ తేదీకి వాయిదా పడింది. రావణ్‌ను విచారించేందుకు తమకు 10 రోజుల పాటు పోలీస్ కస్టడీకి అప్పగించాలని గన్నవరం పోలీసులు న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై స్పందించిన కోర్టు తదుపరి విచారణను 14వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ఆ రోజున రావణ్ కస్టడీకి సంబంధించిన అంశంపై ఇరువర్గాల న్యాయవాదులు కోర్టులో తమ బలమైన వాదనలను వినిపించనున్నారు. పోలీసులు కోరినట్లు 10 రోజుల కస్టడీకి కోర్టు అనుమతిస్తుందా లేదా అనే అంశంపై ఈ నెల 14న జరిగే విచారణలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇరుపక్షాల వాదనలను పరిశీలించిన అనంతరం న్యాయస్థానం తన తుది నిర్ణయాన్ని వెల్లడించనుంది.
కాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, హిందువుల మనోభావాలు కించపరిచిన కేసులో బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ ప్రశ్న రావణ్‌ను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించిన విషయం తెలిసిందే. అయితే విచారణలో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో రావణ్‌ను మరింత లోతు విచారణ చేయాలని పోలీసులు భావిస్తున్నారు. ఈ విచారణలో మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని అంచనా వేస్తున్నారు. ఈ మేరకు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రావణ్ ను కస్టడీకి ఇవ్వాలని అనుమతి కోరారు.






