- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బోనాలు ఉత్సవాల నిర్వహణకు దరఖాస్తు చేసుకోవాలి
సంస్కృతి, సంప్రదాయాలకుnప్రతీక అయిన బోనాల పర్వదినం సందర్భంగా ఉత్సవాల నిర్వహణ కోసం నిధులు మంజూరు అయ్యాయని పిఎసి చైర్మన్ అరికెపూడి గాంధీ తెలిపారు.

దిశ, శేరిలింగంపల్లి : సంస్కృతి, సంప్రదాయాలకుnప్రతీక అయిన బోనాల పర్వదినం సందర్భంగా ఉత్సవాల నిర్వహణ కోసం నిధులు మంజూరు అయ్యాయని పిఎసి చైర్మన్ అరికెపూడి గాంధీ తెలిపారు. బోనాల పండుగ ఉత్సవాల ఏర్పాట్ల నిధుల కోసం దరఖాస్తుల చేసుకోవాలని కోరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో ఈ ఏడాది బోనాల ఉత్సవాల కోసం రూ.20 కోట్ల నిధులు మంజూరు చేశారని, ఈ నిధులు ఆలయాల్లో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని కోరారు. పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్, భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, వైద్య సదుపాయాలు వంటి అన్ని ఏర్పాట్ల కోసం ఈ నిధులు వినియోగించాలని కోరారు. అర్హత (రిజిస్ట్రేషన్) కలిగిన ఆలయ కమిటీలు నిధుల కోసం ఈ నెల 15వ తేదీలోగా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలన్నారు. దరఖాస్తుతో పాటు,టెంపుల్ కమిటీ లెటర్‌ప్యాడ్, ఆలయ బ్యాంక్ ఖాతా వివరాలు, ఆలయ కమిటీ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ ఆధార్ కార్డు ప్రతులు,ఆలయానికి సంబంధించిన అమ్మవారి ఫొటోలు...ప్రతీ కాపీ పై కమిటీ స్టాంపు ముద్రించి జతపరచాలని సూచించారు.






