ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ.. రైతులు, కౌలు రైతులకు గుడ్‌న్యూస్

by Naga Rani Yarlagadda |

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడి అధ్యక్షతన నిర్వహించిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది.

ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ.. రైతులు, కౌలు రైతులకు గుడ్‌న్యూస్
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడి అధ్యక్షతన నిర్వహించిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది. ఈ కేబినెట్ భేటీలో దాదాపు 30కి పైగా కీలక అంశాలకు కేబినెట్ ఆమోదం తెలిపినట్లు మంత్రి పార్థసారధి వెల్లడించారు. గ్రామాల్లో రూ.9,355 కోట్లతో 10 మల్టీ విలేజ్ డ్రింకింగ్ వాటర్ స్కీమ్స్ కు, నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో రూ.1,811 కోట్లతో 2,943 తాగునీటి పథకాలకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వివరించారు. విశాఖలో ఎన్ఐఏ స్పెషల్ కోర్టు, తిరుపతి జిల్లాలో 63 ఏకరాల్లో లాజిస్టిక్స్ పార్క్ ఏర్పాటుపై సుదీర్ఘంగా చర్చించి, నిర్ణయం తీసుకున్నామన్నారు. అలాగే పర్యాటక పాలసీలో కాన్సర్టుల నిర్వహణకై ప్రత్యేక విధానం, రూ.50 కోట్లతో పర్యాటక ప్రచారానికి ఆమోదం తెలిపారు. విజయవాడ సహా.. నెల్లూరు, కడప జిల్లాల్లోని పలు హోటళ్లు, పార్కులకు ప్రోత్సాహకాలు ఇవ్వనున్నారు.

అలాగే విశాఖ, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో అంబేద్కర్ గురుకుల సీఈఓలు ఏర్పాటు చేసి.. ఐఐటీ జేఈఈ, నీట్ కు రెసిడెన్షియల్ కోచింగ్ ఇవ్వనున్నట్లు తెలిపారు. రాజధాని అమరావతిలో రెండో విడతకు భూములు ఇచ్చే 7 గ్రామాల రైతులకు రూ. లక్షన్నర వరకూ సాగు రుణమాఫీకి కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. 2026 జనవరి 6 కంటే ముందు తీసుకున్న రుణాలకు ఈ మాఫీ వర్తిస్తుందని మంత్రి పార్థసారధి తెలిపారు. అలాగే భూములు ఇచ్చిన, ఇవ్వబోయే రైతులకు వార్షిక కౌలు పెంపు ప్రతిపాదనలకు కూడా ఆమోదం కేబినెట్ ఆమోదం తెలిపిందని పేర్కొన్నారు. మెట్ట రైతులకు రూ.40 వేలు, జరీబు రైతులకు రూ.60 వేలు వరకూ కౌలు పెంపుకు, రెండో విడత భూ సమీకరణ గ్రామాల్లోని ఇనాం భూములకు పరిహారానికి ఆమోదం తెలిపామన్నారు. 307 ఎకరాల ఇనాం భూములకు దేవాదాయశాఖకు రూ.159 కోట్ల పరిహారం అందించనున్నట్లు వెల్లడించారు. NFDBకి భారీ అక్వేరియం, కార్యాలయం కోసం, ఈశా ఫౌండేషన్, ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థలకు, సీఐఐ గ్లోబల్ లీడర్షిప్ సెంటర్ సంస్థలకు భూ కేటాయింపులకు, ఆమోదం మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వీటితోపాటు పెద్దగెడ్డ, కుప్పం ప్రాజెక్టులకు కేబినెట్ అనుమతులు మంజూరు చేసింది.

Next Story