- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
'వన్ నేషన్, వన్ ఎలక్షన్' జేపీసీ అధ్యయన పర్యటన.. గోవాలో అనురాగ్ ఠాకూర్ కీలక వ్యాఖ్యలు
‘వన్ నేషన్, వన్ ఎలక్షన్’ జేపీసీ గోవా పర్యటన.. తరచుగా వచ్చే ఎన్నికల వల్ల చిన్న రాష్ట్రాలపైనే భారీ ప్రభావం పడుతుందన్న అనురాగ్ ఠాకూర్!

దిశ, వెబ్ డెస్క్: దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించే ‘వన్ నేషన్, వన్ ఎలక్షన్’ (One Nation, One Election) విధానంపై ఏర్పాటు చేసిన జాయింట్ పార్లమెంటరీ కమిటీ (JPC) వివిధ రాష్ట్రాల్లో ముమ్మరంగా పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా గోవాలోని బెనాలిమ్‌కు చేరుకున్న కమిటీ ప్రతినిధులు రాజకీయ పార్టీలు, బ్యూరోక్రాట్లు, న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరిపారు. ఈ సందర్భంగా జేపీసీ సభ్యుడు, బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ మీడియాతో మాట్లాడుతూ.. ఈ క్షేత్ర స్థాయి అధ్యయన పర్యటన కమిటీకి అత్యంత కీలకమైన నివేదిక రూపకల్పనలో ఎంతో సహాయపడుతుందని పేర్కొన్నారు.
తరచుగా జరిగే ఎన్నికల వల్ల దేశ ఆర్థిక, పరిపాలనా వ్యవస్థలపై పడే ప్రభావాన్ని గోవా ముఖ్యమంత్రి, చీఫ్ సెక్రటరీ, వివిధ శాఖల అధికారులు జేపీసీకి పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారని అనురాగ్ ఠాకూర్ తెలిపారు. "గోవా లాంటి ఒక చిన్న రాష్ట్రంపైనే మురవడిగా జరిగే ఎన్నికలు ఇంతటి తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంటే.. ఇక పెద్ద రాష్ట్రాలు, దేశం మొత్తం మీద దీని ప్రభావం ఎంత భారీ స్థాయిలో ఉంటుందో మనం ఊహించవచ్చు" అని ఆయన వ్యాఖ్యానించారు. వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్న గ్రౌండ్-లెవల్ ఫీడ్‌బ్యాక్ ఆధారంగానే నివేదికను సిద్ధం చేస్తామన్నారు. గోవా పర్యటన ముగిసిన అనంతరం జేపీసీ బృందం ఉత్తరప్రదేశ్‌లోని లక్నోకు వెళ్లనుందని.. అక్కడ సీఎం యోగి ఆదిత్యనాథ్, ప్రతిపక్ష నాయకుడు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, ప్రైవేట్, పబ్లిక్ సెక్టార్ సంస్థల ప్రతినిధులతో భేటీ కానున్నట్లు ఠాకూర్ వెల్లడించారు.






