SheRents : కేవలం మహిళలకు మాత్రమే!

by Javid Pasha |

SheRents : కేవలం మహిళలకు మాత్రమే!
X

దిశ, ఫీచర్స్ : ఒకప్పటిలా చదువుకున్న ఊరిలో లేదా దగ్గరలోని సిటీలో మాత్రమే ఉద్యోగాలు చేసే పరిస్థితులు ఇప్పుడు లేవు. ఉపాధికోసం, ఉద్యోగాలం కోసం జిల్లాలు దాటి, రాష్ట్రాలు దాటి, దేశాలు దాటి వెళ్లాల్సిన పరిస్థితులు నెలకొని ఉంటున్నాయి. చాలామంది అదే చేస్తున్నారు కూడా. తమ అర్హతకు తగిన ఉద్యోగం, జీతం వంటివి ఏ సిటీలో లభిస్తే.. ఆ సిటీకి షిఫ్ట్ అవుతున్నారు? అయితే ఇలాంటప్పుడు కొత్తగా వెళ్లిన సిటీలో నివాసం కోసం తగిన ఫ్లాట్స్, అలాగే ఫ్లాట్‌మేట్స్ దొరకడం కష్టంగా మారుతోంది. స్త్రీల విషయంలో అయితే ఇది మరింత ఇబ్బందిగా ఉంటోంది. కాగా ఈ సమస్యకు చక్కటి పరిష్కారం చూపాలనుకున్నారు 25 ఏళ్ల ఎంట్రప్రెన్యూర్ అనౌష్క షా (Anoushka Shah). ఆలోచన తట్టిందే మొదలు ఆమె కేవలం మహిళలకోసం స్టార్టప్‌ను ప్రారంభించారు. ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉంది? అయితే ఈ వేదిక ఉద్దేశమేమిటి? ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఎందుకోసమంటే..

ఉద్యోగాల కోసమో, చదువులకోసమో కొత్త నగరాలకు వెళ్లే విద్యార్థినులు, వృత్తి నిపుణులు అక్కడ ఫ్లాట్లు రెంటుకు తీసుకుంటూ ఉంటారు. కొన్నిసార్లు అద్దెభారం తగ్గించుకోవడం కోసం ఇద్దరు ముగ్గురు కలిసి ఒకే ఫ్లాట్ లేదా ఒకే రూమ్ తీసుకొని కలిసి మెలిసి ఉంటారు. అయితే కొత్తగా వెళ్లినప్పుడు మాత్రం ఫ్లాట్స్ దొరకడం, రూమ్‌మేట్స్ లేదా ఫ్లాట్‌మేట్స్ దొరకడం కష్టమే. అందుకోసం పలువురు వాట్సాప్ గ్రూపులు, ఫేస్‌బుక్, ఇన్ స్టా వంటి వేదికల్లో తాము వెళ్లబోయే సిటీలో అద్దె ఇండ్ల గురించి ఆరా తీస్తుంటారు. ఫ్లాట్ బ్రోకర్స్‌ను సంప్రదిస్తుంటారు. కానీ దీనివల్ల కొన్ని సమస్యలు కూడా ఎదురవుతుంటాయి. కాబట్టి అలాంటి వాటికి చెక్ పెట్టేందుకు SheRents అనే ఒక ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించింది అనౌష్క.

DigiLocker ద్వారా వెరిఫికేషన్..

షీ-రెంట్స్(SheRents ) స్టార్టప్ ప్రత్యేకత ఏమిటంటే ఇది కేవలం మహిళలకు మాత్రమే రూపొందించిన ఎక్స్‌క్లూజివ్ వెరిఫైడ్ వేదిక. కాబట్టి విద్యార్థినులు, వర్కింగ్ ప్రొఫెషనల్స్ అయిన మహిళలు సురక్షితంగా, పారదర్శకంగా దీని ఆధారంగా నచ్చిన ఫ్లాట్లను, ఫ్లాట్‌మేట్స్‌ను కనుగొనవచ్చు. పైగా ఇందులో DigiLocker ద్వారా ఐడెంటిటీ వెరిఫికేషన్ వ్యవస్థను అంతర్గంత చేయడంవల్ల నమ్మకమైన వేదికగా ప్రచారం పొందుతోంది. అంటే ఇందులో నమోదైన ప్రతీ మెంబర్ తన గుర్తింపును ధృవీకరించిన తర్వాత మాత్రమే ఫ్లాట్లు లేదా ఫ్లాట్‌మేట్స్‌తో కనెక్ట్ అవుతారు.

ప్రధాన ఉద్దేశం అదే..

కొత్త నగరాల్లో ఉద్యోగాల కోసం, చదువులకోసం వెళ్లే మహిళలకు సురక్షితమైన, పారదర్శకమైన వాతావరణాన్ని సృష్టించడమే ‘షీ రెంట్స్’ ప్రధాన ఉద్దేశమని దాని వ్యవస్థాపకులురాలు అనౌష్క కూడా పేర్కొంటున్నారు. అయితే ఇప్పటికిప్పుడు దీనిని వినియోగించుకునే అవకాశం లేదు. ఎందుకంటే ఈ యాప్ ఇంకా పూర్తిగా లాంచ్ కాలేదు. అభివృద్ధి దశలోనే ఉంది. ఆసక్తి ఉన్నవారు మాత్రం SheRents కమ్యూనిటీ (WhatsApp గ్రూప్)లో చేరవచ్చునని పేర్కొంటున్నారు.

Next Story