- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సింహాచలంలో హైటెన్షన్.. 13 షాపుల ఓనర్ల ఆత్మహత్యాయత్నం..!
by Vemula.Srinu Prasad |
విశాఖ జిల్లా సింహాచలంలో షాపుల తొలగింపు ఉద్రిక్తంగా మారింది. కొండ కింద దిగువన తొలిపావంచ రోడ్డు విస్తరణకు షాపులు అడ్డంకిగా మారాయి. దీంతో వాటిని తొలగించేందుకు అధికారులు శుక్రవారం యత్నించారు.....

X
దిశ, వెబ్ డెస్క్: విశాఖ జిల్లా సింహాచలంలో షాపుల తొలగింపు ఉద్రిక్తంగా మారింది. కొండ కింద దిగువన తొలిపావంచ రోడ్డు విస్తరణకు షాపులు అడ్డంకిగా మారాయి. దీంతో వాటిని తొలగించేందుకు అధికారులు శుక్రవారం యత్నించారు. వేరే చోట స్థలం కేటాయించి అక్కడున్న 13 షాపులను తీసివేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. అయితే షాపు యజమానులు ఆందోళనకు దిగారు. షాపులు తొలగించొద్దని డిమాండ్ చేశారు. ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. దీంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. తమకు ఇచ్చిన స్థలం దూరంగా ఉన్నాయని, ఎన్నో ఏళ్లుగా ఈ షాపులనే నమ్ముకుని బతుకుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అవి కూడా లేకపోతే తమకు ఆత్మహత్యే శరణ్యమని వాపోయారు.
Next Story






