నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. త్వరలో మరో 20 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు: పొంగులేటి

by Prasad Jukanti |

త్వరలో 20 వేల ఉద్యోగాల నోటిఫికేషన్ ఇస్తామని, రాబోయే రెండేళ్లలో రైతులకు భూధార్ కార్డులు అందిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. త్వరలో మరో 20 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు: పొంగులేటి
X

దిశ, డైనమిక్ బ్యూరో: పేదల సంక్షేమం కోసం ప్రజా ప్రభుత్వం పని చేస్తోందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. పేదలను ఆదుకునేందుకు పని చేస్తున్నామన్నారు. రైతులను అన్ని రకాలుగా ఆదుకుంటున్నామని చెప్పారు. ఖమ్మం జిల్లాలో జరిగిన రైతు ఆశీర్వాద సభలో మాట్లాడిన మంత్రి.. తొలి రెండేళ్లలో సుమారు 71 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామని, త్వరలో మరో 20 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వబోతున్నామని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి కొట్టొచ్చినట్లు కనిపిస్తోందన్నారు. రాబోయే రెండేళ్లలో రాష్ట్రంలోని ప్రతి గజాన్ని సర్వే చేసి సాగులో ఉన్నా రైతులకు మ్యాప్ లతో సహా భూధార్ కార్డులను అందజేస్తామన్నారు. రైతులను రాజులను చేస్తామని చెప్పినట్లుగా ఆ ప్రయత్నం చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో వచ్చిన ప్రతి ఎలక్షన్‍లో ప్రజా ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదిస్తున్నారంటే అదే మా పని తీరుకు నిదర్శనం అన్నారు.

విషం కక్కుతున్నారు:

కడుపులో విషం పెట్టుకుని ప్రతిపక్షాలు విషం కక్కుతున్నాయన్నారు. ఇప్పటికే బీఆర్ఎస్‍కు ప్రజలు రెండు సార్లు ప్రజలు బుద్ధి చెప్పారని రాబోయే ఎన్నికల్లో మరోసారి వారికి భంగపాటు తప్పదన్నారు. రాష్ట్రంలో రెండో విడత ఇందిరమ్మ ఇండ్ల మంజూరైందన్నారు. ఆ తర్వాత మూడు, నాలుగో విడత కూడా ఇస్తామని అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడమే రేవంత్ రెడ్డి ప్రభుత్వం లక్ష్యం అన్నారు.

Next Story