అఖిల్ ‘లెనిన్’ రిలీజ్.. షాకింగ్ పోస్ట్‌తో వార్తల్లో నిలిచిన సమంత

by Chukka Sudharani |   (  Updated:2026-07-10 11:54:46  IST  )

దాదాపు మూడేళ్ల నిరీక్షణ తర్వాత ‘లెనిన్’తో గట్టి కమ్ బ్యాక్ ఇచ్చాడు అక్కినేని హీరో అఖిల్.

అఖిల్ ‘లెనిన్’ రిలీజ్.. షాకింగ్ పోస్ట్‌తో వార్తల్లో నిలిచిన సమంత
X

దిశ, సినిమా: దాదాపు మూడేళ్ల నిరీక్షణ తర్వాత ‘లెనిన్’తో గట్టి కమ్ బ్యాక్ ఇచ్చాడు అక్కినేని హీరో అఖిల్. మురళీ కిశోర్ అబ్బూరు దర్శకత్వంలో, భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా జులై 10న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మొదటి షో నుంచే బ్లాక్ బస్టర్ హిట్ టాక్ సొంతం చేసుకుని దూసుకెళ్తుంది. అంతే కాకుండా ఇందులో అఖిల్ క‌ష్టం స్క్రీన్ పై అడుగ‌డుగునా క‌నిపిస్తుంది. ఈ పాత్ర కోసం తనను తాను చాలా మార్చుకున్నట్లు తెలుస్తుంది. ఇక అఖిల్ ఇంటెన్స్ అండ్ మాస్ లుక్, యాసకు అయితే ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఇప్పటి వరకు మాస్ అంటే జూనియర్ ఎన్టీఆర్ గుర్తోచ్చేవాడు.. లెనిన్‌తో ఆ లిస్ట్‌లో అఖిల్ కూడా చేరిపోయాడు అంటూ కామెంట్స్‌తో సందడి చేస్తున్నారు అక్కినేని ఫ్యాన్స్. చివ‌ర్లో ఎమోష‌న్ కూడా బ‌లంగా పండటంతో మనోడు హిట్ కొట్టేశాడు అంటూ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. ఈ సినిమా సక్సెస్‌పై టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో లెనిన్ ట్రైలర్ షేర్ చేసి.. ‘అక్కినేని అఖిల్‌తో పాటు ‘లెనిన్’ టీమ్ మొత్తానికి ఆల్ ది వేరీ బెస్ట్.. ఇప్పటికే బ్లాక్ బస్టర్ వైబ్ కనిపిస్తుంది’ అంటూ చెప్పుకొచ్చింది. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన పోస్ట్ వైరల్ కావడంతో.. అన్నతో (నాగచైతన్య) విడిపోయినప్పటికీ అఖిల్, సమంత మధ్య స్నేహ బంధం మాత్రం అలాగే ఉందంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. అలాగే.. ‘లెనిన్’ సినిమా ప్రమోషన్స్‌లో అఖిల్ కూడా సమంత ‘మా ఇంటి బంగారం’ సినిమా గురించి మాట్లాడి ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే.

Next Story