- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్రంలో మరో దారుణం.. భార్యను కిరాతకంగా నరికి చంపిన భర్త
by Naga Rani Yarlagadda |
రాష్ట్రంలో మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. గుంటూరు జిల్లా తెనాలి మండలం అంగలకుదురులో ఓ భర్త భార్యను కిరాతకంగా నరికి చంపాడు.

X
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. గుంటూరు జిల్లా తెనాలి మండలం అంగలకుదురులో ఓ భర్త భార్యను కిరాతకంగా నరికి చంపాడు. ఆపై తెనాలి పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంధ్యారాణి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మన్నే నరేంద్రబాబు, సంధ్యారాణిలు భార్య భర్తలు. చాలాకాలంగా వీరిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. కుటుంబ కలహాలు, భార్య ప్రవర్తనపై నరేంద్ర పెంచుకున్న అనుమానమే ఈ హత్యకు ప్రధాన కారణాలని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. పోలీసుల అదుపులో ఉన్న నిందితుడు నరేంద్రను ప్రస్తుతం విచారిస్తున్నారు. మరోవైపు సంధ్యారాణి కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. భర్త నరేంద్రను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.
Next Story






