- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జెమిని AI మరో అద్భుతం.. టైప్ చేయకుండానే అలాంటి వాయిస్ ఫీచర్లకు చాన్స్!
వాయిస్ కమాండ్స్ ఇచ్చి ఈమెయిల్స్‌ను సెర్చ్ చేయగల ఫీచర్‌ను గూగుల్ పరీక్షిస్తోంది!

దిశ, ఫీచర్స్ : గూగుల్‌కు సంబంధించిన అత్యాధునిక ఏఐ మోడల్ జెమిని(Gemini)ని గురించి తెలిసిందే. సమాచార సేకరణలో, అనుమానాల నివృత్తిలో ఇది యూజర్లకు ఎంతో ఉపయోగపడుతున్నది. అయితే తాజాగా మరో అప్డేట్‌తో మన ముందుకు వచ్చింది. ఏంటంటే.. గూగుల్ తన జెమినీ ఏఐని ఉపయోగించి జీమెయిల్ (Gmail) సర్వీస్‌లో కొత్త తరహా కన్వర్సేషనల్ వాయిస్ ఫీచర్లను టెస్ట్ చేస్తోంది. ఇంతకీ దీని పనితీరు ఏమిటి? ఏ విధంగా ఉపయోగపడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
గూగుల్ ప్రవేశపెట్టబోయే కొత్త కన్వర్జేషనల్ వాయిస్ ఫీచర్ ద్వారా యూజర్లు తమ ఇన్‌బాక్స్‌తో సహజమైన పద్ధతిలో (Natural Language) మాట్లాడవచ్చు. ఏమాత్రం టైప్ చేయకుండానే.. కేవలం వాయిస్ కమాండ్స్ ఇచ్చి ఈమెయిళ్లను సెర్చ్ చేయడం, చదవడం, సమ్మరైజ్ చేయడం, రిప్లయ్ ఇవ్వడం వంటి పనులు సులభంగా చేసుకోవచ్చు. పైగా ఇది హ్యాండ్స్-ఫ్రీ అనుభవాన్ని అందిస్తూ, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు లేదా బిజీగా ఉన్నప్పుడు కూడా చాలా ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. కాకపోతే ఈ ఫీచర్ ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉంది. Google AI Pro, AI Ultra & Google Workspace యూజర్లకు త్వరలో రోల్ అవుట్ అయ్యే అవకాశం ఉంది. అందుబాటులోకి వస్తే.. దీని ద్వారా ఈ-మెయిల్ నిర్వహణ మరింత సులభంగా, వేగవంతంగా మారనుంది. ముఖ్యంగా బిజీగా ఉండే వ్యక్తులకు మరింత ఉపయోగకరంగా ఉంటుంది.






