ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పని చేయాలి..

by Taduka Kalyani |

నారాయణఖేడ్ నియోజకవర్గంలో ప్రజా ప్రతినిధులు, పంచాయతీ కార్యదర్శులు సమన్వయంతో పని చేయాలని, ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకొస్తే వెంటనే పరిష్కరిస్తానని స్థానిక ఎమ్మెల్యే పట్లోళ్ల డాక్టర్ సంజీవరెడ్డి అన్నారు.

ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పని చేయాలి..
X

దిశ, నారాయణఖేడ్: నారాయణఖేడ్ నియోజకవర్గంలో ప్రజా ప్రతినిధులు, పంచాయతీ కార్యదర్శులు సమన్వయంతో పని చేయాలని, ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకొస్తే వెంటనే పరిష్కరిస్తానని స్థానిక ఎమ్మెల్యే పట్లోళ్ల డాక్టర్ సంజీవరెడ్డి అన్నారు. శుక్రవారం నారాయణఖేడ్ మండలం జూకల్ శివారులోని కన్వెన్షన్ ఆల్ నిర్వహించిన గ్రామపంచాయతీ సమగ్ర అభివృద్ధి ప్రణాళిక ( జీపీడీపీ) సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు శిక్షణ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.. గ్రామాల్లో ఎదురవుతున్న ప్రాథమిక సమస్యలను గుర్తించి, వాటిని ఎప్పటికప్పుడు పరిష్కరించడంలో సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు పాత్ర అత్యంత కీలకమన్నారు. ముఖ్యంగా గ్రామాల్లో ఎక్కడ నీటి ఎద్దడి రాకుండా ముందస్తు ప్రణాళిక రూపొందించాలని, వీధి దీపాల నిర్వహణ, విద్యుత్ సమస్యల పరిష్కారం పై ప్రత్యేక దృష్టి సాధించాలన్నారు. అంతర్గత రోడ్లు, డ్రైనేజీలు, పారిశుద్ధ్య నివారణ వంటి మౌలిక వసతుల కల్పన కు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. గ్రామాలను ఆదర్శవంతంగా తీర్చిదిదెందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉందన్నారు. అధికారులందరూ సమన్వయంతో పనిచేసి నిధుల వినియోగంలో పార దర్శకత్వం పాటించాలన్నారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి నా వంతు పూర్తి సహకారం మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో డీపీఓ మల్లారెడ్డి, జెడ్ పి సిఈఓ జానకి రెడ్డి, డీ ఎల్ పీ ఓ సుధాకర్ రెడ్డి, ఎంపీడీవోలు శ్రీనివాస్ రెడ్డి, చంద్రశేఖర్, మహేష్ కుమార్, ఆండాలమ్మ, దయాకర్ రావు, సంగ్రామ్, హరినందరావ్, ఎంపీవోలు నారాయణ, మహమ్మద్ హుస్సేన్, ఇందిరమ్మ, కృష్ణకుమారి, బ్రహ్మం, లక్ష్మయ్య, సురేష్ కుమార్, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

Next Story