100 పడకల ఆసుపత్రిపై మాజీ ఎమ్మెల్యే డ్రామాలు

by velandi.Saikiran |

100 పడకల ఆసుపత్రి నిర్మాణంపై రాజకీయ లబ్ది పొందడడానికి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ డ్రామాలు చేస్తున్నారని చొప్పదండి మున్సిపల్ చైర్మన్ వడ్లూరి సరిత శ్రీనివాస్ అన్నారు.

100 పడకల ఆసుపత్రిపై మాజీ ఎమ్మెల్యే డ్రామాలు
X

దిశ, చొప్పదండి: 100 పడకల ఆసుపత్రి నిర్మాణంపై రాజకీయ లబ్ది పొందడడానికి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ డ్రామాలు చేస్తున్నారని చొప్పదండి మున్సిపల్ చైర్మన్ వడ్లూరి సరిత శ్రీనివాస్ అన్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం విలేఖరుల సమావేశంలో సరిత మాట్లాడుతూ..10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో శాంక్షన్ పేపర్లు తప్ప ఒక్క పనీ జరగలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే అన్ని పనులు అభివృద్ధి పథంలో జరుగుతున్నాయని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం చొరవతో వేగంగా పనులు జరుగుతున్నాయని అన్నారు.తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే చొప్పదండి నియోజకవర్గ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం చొరవతో రూ.37.50 కోట్ల నిధులతో 100 పడకల ఆసుపత్రికి శంకుస్థాపన జరిగిందన్నారు. ఇప్పటికే 90 శాతం పనులు పూర్తయ్యాయని, మిగిలిన ఎలక్ట్రికల్ వైరింగ్, ఫర్నీచర్ పనులు కూడా పూర్తి చేసి ఇంకో రెండు నెలల్లో ప్రజలకు అందుబాటులోకి తెస్తామని తెలిపారు. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం 24 గంటలు నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ అన్ని పనులను అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని కొనియాడారు.

ఆయన కృషితోనే చొప్పదండిలో ఆరోగ్య, విద్య, రైతు సంక్షేమ రంగాల్లో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ అభివృద్ధి చూసి ఓర్వలేక గత ప్రభుత్వ పాలకులు కుట్రపూరితమైన, భయంతో కూడిన మాటలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. మళ్లీ అధికారంలోకి రాలేమనే భయంతోనే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు అని విమర్శించారు. ఇలాంటి కుట్రలను కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తుందని, ప్రజలు అన్నీ గమనిస్తున్నారని హెచ్చరించారు.గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందేమిటో ప్రజలకు తెలుసన్నారు. ఇప్పుడు మాత్రం ఫోటోలకు పోజులు ఇచ్చి క్రెడిట్ కొట్టేయాలని చూడటం సిగ్గుచేటని అన్నారు. పదేళ్లలో వాళ్ళు చేసిన పనులు సున్నా అని మా ప్రభుత్వం రెండేళ్లలో 90 శాతం పనులు పూర్తి చేసి రెండు నెలల్లో అందుబాటులోకి తెస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్ పర్సన్ పెరుమాండ్ల మానసగంగయ్య, గుర్రం సుజిత్ రెడ్డి, గుర్రం రాజేందర్ రెడ్డి, పిట్టల వెంకటేశం, కనుమల్ల రాజశేఖర్, నాయకులు ముద్దం తిరుపతి గౌడ్, వడ్లూరు శ్యామ్ పాల్గొన్నారు.

Next Story