- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రతిపాదిత రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణం విరమించుకోవాలి
ప్రతిపాదిత రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణం విరమించుకోవాలని ఎంపీ ఈటలకు వినతి పత్రం అందజేశారు బస్తీవాసులు.

దిశ, మల్కాజిగిరి : వినాయక్ నగర్ డివిజన్ పరిధిలోని రైల్వే గేటు వద్ద ప్రతిపాదించిన రైల్వే అండర్ బ్రిడ్జి (ఆర్యుబి) నిర్మాణాన్ని విరమించాలని ఎంపీ ఈటలకు వినతి పత్రం అందజేశారు బస్తీవాసులు. మాజీ కార్పొరేటర్ శ్రీమతి క్యానం రాజ్యలక్ష్మి ప్రతిపాదన మేరకు మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ వినాయక్ నగర్ రైల్వే క్రాసింగ్ వద్ద సంబంధిత శాఖల అధికారులతో కలిసి జాయింట్ ఇన్‌స్పెక్షన్ నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక బస్తీ వాసులు, వినాయక్ నగర్ స్లం డెవలప్‌మెంట్ కమిటీ సభ్యులు పిట్టల శ్రీనివాస్, గోపాల కృష్ణ, వీరేశం సుధాకర్ తదితరులు పెద్ద ఎత్తున పాల్గొని తమ అభ్యంతరాలను ఎంపీ దృష్టికి తీసుకువచ్చారు. ప్రతిపాదిత ఆర్యుబి నిర్మాణం వల్ల అనేక కుటుంబాలు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందని, వినాయక్ నగర్‌లోని అంతర్గత వీధులు, వ్యాపార కార్యకలాపాలు నిర్వీర్యమవుతాయని, స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని వివరించారు.
స్థానికుల వినతిని పూర్తిగా ఆలకించిన ఎంపీ ఈటల రాజేందర్ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలించాలని సంబంధిత రైల్వే, మున్సిపల్, రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ప్రజల జీవనోపాధి, రాకపోకలు, స్థానిక అవసరాలను దృష్టిలో ఉంచుకొని అన్ని కోణాల్లో అధ్యయనం చేసి, అందరికీ ఆమోదయోగ్యమైన ప్రత్యామ్నాయాన్ని రూపొందించాలని సూచించారు. ఎంఎంసీ జోనల్ కమిషనర్ సంచిత్ గంగ్వార్, ఐఏఎస్, ఎంఎంసీ డిప్యూటీ కమిషనర్, మౌలాలి సర్కిల్ బాలకృష్ణ ప్రసాద్, డిప్యూటీ చీఫ్ ఇంజినీర్ (రోడ్ సేఫ్టీ ప్రాజెక్ట్స్) మల్లికార్జున్, డిప్యూటీ తహసీల్దార్ రంజని కుమారి పాల్గొన్నారు.
జాయింట్ ఇన్‌స్పెక్షన్ అనంతరం ఎంపీ ఈటల రాజేందర్ వాజ్‌పేయి నగర్‌లో ఎంపీ స్థానిక ప్రాంతాల అభివృద్ధి నిధులు (ఎంపీ లాడ్స్)తో ఏర్పాటు చేసిన వినోభనగర్ మరియు వాజ్ పేయీ నగర్ లో బోర్‌వెల్‌ను ప్రారంభించారు. అనంతరం వాజ్‌పేయి నగర్ లో నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ హాల్‌ను కూడా ప్రారంభించి ప్రజలకు అంకితం చేశారు. ఈ కార్యక్రమాలలో పెద్ద ఎత్తున స్థానిక ప్రజలు, బీజేపీ నాయకులు ఆర్ కె శ్రీనివాస్, శ్రావణ ఉరపల్లి, వి.కె. మహేష్, డా. నరసింహ గౌడ్, ఆనంద్ గౌళికర్, గోపు రమణ రెడ్డి, వాసంశెట్టి శ్రీనివాస్, మంగేష్, ప్రసన్న, బక్క నాగరాజ్, ప్రభు గుప్తా, మంగేష్, ఉడత నవీన్, బాలచందర్ గౌడ్, నర్సింగ్ రావు, ఓం ప్రకాష్, మల్లేష్ యాదవ్, సాయి సురేష్, సుమలత, జ్యోతిర్మయి తదితరులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.






