- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, వెబ్‌డెస్క్: రైల్వే స్టేషన్లలో కౌంటర్ల వద్ద క్యూలైన్లలో నిలబడే పనిలేకుండా డిజిటల్ అన్ రిజర్వ్డ్ టికెట్లు బుక్ చేసుకునే ప్రయాణికులకు ఇండియన్ రైల్వే డిపార్ట్మెంట్ కీలక హెచ్చరిక జారీ చేసింది. ఇకపై ప్రయాణ సమయంలో రైల్ వన్ యాప్ ద్వారా బుక్ చేసిన ఒరిజినల్ డిజిటల్ టికెట్ ను మాత్రమే చెల్లుబాటు అయ్యే టికెట్ గా పరిగణిస్తామని స్పష్టం చేసింది. ఇటీవల ఓ మహిళా ప్రయాణికురాలు వాట్సప్ స్క్రీన్ షాట్ చూపించగా.. రైలు కదిలిన తర్వాత ఆ టికెట్ బుక్ చేసినట్లు తేలింది. దీంతో టీసీ ఆమెకు ఫైన్ విధించారు. ఈ క్రమంలోనే రైల్వేశాఖ రైల్ వన్ యాప్ ద్వారా బుక్ చేసే అన్ రిజర్వ్డ్ టికెట్ల విషయం కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది.
కొత్త రూల్స్ ఇవే.. ఇవి అస్సలు చెల్లవు!
రైల్వే బోర్డు సవరించిన నిబంధనల ప్రకారం.. టికెట్ స్క్రీన్ షాట్లు, మొబైల్ లో తీసుకున్న టికెట్ ఫొటోలు, పీడీఎఫ్ వర్షన్లు, వాట్సప్ లేదా ఇతర మెసేజింగ్ యాప్ ల ద్వారా పంపిన టికెట్లు చూపిస్తే.. వారిని టికెట్ లేని ప్రయాణికులుగా పరిగణించి భారీ జరిమానా విధిస్తారు. టికెట్ ను ఏ మొబైల్ నంబర్, ఏ ఫోన్ నుంచి బుక్ చేశారో.. రైలులో ప్రయాణించే సమయంలో అదే మొబైల్లో, అదే నంబరుతో యాప్ ఓపెన్ చేసి బుక్ చేసిన టికెట్ ను చూపించాల్సి ఉంటుంది. కొత్త నిబంధనల ప్రకారం.. డిజిటల్ అన్‌రిజర్వ్‌డ్ టిక్కెట్లను ప్రయాణికుడు ఎక్కాల్సిన బోర్డింగ్ స్టేషన్ నుండి రైలు బయలుదేరడానికి ముందే బుక్ చేసుకోవాలి. రైలు స్టేషన్ వదిలి వెళ్లిన తర్వాత జనరేట్ అయిన ఏ డిజిటల్ టిక్కెట్ అయినా చెల్లదు. ఈ రూల్స్ కేవలం అన్ రిజర్వ్డ్ టికెట్లకు మాత్రమే వర్తిస్తాయి. స్లీపర్, ఏసీ క్లాస్ వంటి రిజర్వ్డ్ టికెట్లకు వర్తించవు. వాటిని ఆధార్, పాన్ కార్డు వంటి గుర్తింపు కార్డుల ద్వారా ధృవీకరిస్తారు.






