- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎస్‌ఐఆర్ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు భాగస్వాములు కావాలి
ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు చురుకుగా భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా సూచించారు.

దిశ, లోకేశ్వరం : ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు చురుకుగా భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా సూచించారు. శుక్రవారం సాయంత్రం లోకేశ్వరం మండలంలోని హవర్గా గ్రామంలో కొనసాగుతున్న ఎస్‌ఐఆర్ కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఈ కార్యక్రమాన్ని నిర్ణీత గడువులోగా పూర్తి చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు.
హవర్గా గ్రామంలో ఇప్పటివరకు కేవలం 34 శాతం మాత్రమే ప్రక్రియ పూర్తయిందని, మిగిలిన దరఖాస్తుల పరిశీలన, నమోదు ప్రక్రియను సోమవారం లోపు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ లక్ష్యాన్ని చేరుకోవడంలో వార్డు సభ్యులు, ప్రజాప్రతినిధులు, బీఎల్‌వోలు, గ్రామస్థులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అర్హులైన ప్రతి ఓటరు పేరు ఓటరు జాబితాలో నమోదయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సూర్యారావు, గ్రామ సర్పంచ్ భుజంగరావు తదితరులు పాల్గొన్నారు.






