రోడ్డు ప్రమాదాల నివారణకు సమగ్ర చర్యలు తీసుకోవాలి

by Ratna Kumari |

రోడ్డు ప్రమాదాల నివారణకు సమగ్ర చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ నితిక పంత్ జాతీయ రహదారి అధికారులను ఆదేశించారు.

రోడ్డు ప్రమాదాల నివారణకు సమగ్ర చర్యలు తీసుకోవాలి
X

దిశ, వాంకిడి : రోడ్డు ప్రమాదాల నివారణకు సమగ్ర చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ నితిక పంత్ జాతీయ రహదారి అధికారులను ఆదేశించారు. శుక్రవారం మండలంలోని బంబార, ఖమాన, వాంకిడి ఎక్స్‌రోడ్డు ప్రాంతాల్లోని ప్రమాదకర ప్రాంతాలను (బ్లాక్ స్పాట్స్) నేషనల్ హైవే ప్రాజెక్టు డైరెక్టర్ అజయ్‌తో కలిసి ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, వాహనదారులకు ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన ప్రాంతాల్లో స్పష్టమైన సైన్‌బోర్డులు, సోలార్ లైటింగ్ వ్యవస్థలను ఏర్పాటు చేయాలని సూచించారు.

ప్రమాదాలకు ఎక్కువగా అవకాశం ఉన్న ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు, స్పీడ్ లిమిట్ సూచికలు, స్పీడ్ బ్రేకర్లు, రిఫ్లెక్టివ్ మార్కింగ్‌లు, అవసరమైన చోట రోడ్ బంప్స్ ఏర్పాటు చేయడం ద్వారా ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని తెలిపారు. వాహనదారులు ముందుగానే అప్రమత్తమై జాగ్రత్తగా ప్రయాణించేలా రహదారి భద్రతా చర్యలను పటిష్టం చేయాలని సూచించారు. జాతీయ రహదారి అధికారులు, పోలీసు శాఖ పరస్పర సమన్వయంతో పనిచేసి ప్రమాదాల నివారణకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. ఈ పరిశీలనలో డీఎస్పీ అశోక్, సీఐ వేణుగోపాల్, ఇన్‌స్పెక్టర్ రవీందర్, ఎస్‌ఐ మహేందర్ తదితరులు పాల్గొన్నారు.

Next Story