బాలీవుడ్ నటుడు రాజ్‌పాల్ యాదవ్‌కు జైలు శిక్ష

by Gantepaka Srikanth |

ప్రముఖ బాలీవుడ్ హాస్యనటుడు రాజ్‌పాల్ యాదవ్‌కు చెక్ బౌన్స్ కేసులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది.

బాలీవుడ్ నటుడు రాజ్‌పాల్ యాదవ్‌కు జైలు శిక్ష
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ బాలీవుడ్ హాస్యనటుడు రాజ్‌పాల్ యాదవ్‌కు చెక్ బౌన్స్ కేసులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో ఆయనకు గతంలో విధించిన మూడు నెలల జైలు శిక్షను ఢిల్లీ హైకోర్టు సమర్థించింది. ఆయన దాఖలు చేసిన అప్పీల్‌ను తిరస్కరిస్తూ, తక్షణమే లొంగిపోవాలని లేదా పోలీసుల విచారణను ఎదుర్కోవాలని కోర్టు స్పష్టం చేసింది. వివరాల్లోకి వెళ్తే.. రాజ్‌పాల్ యాదవ్‌ 2010లో తాను హీరోగా ‘అతా పతా లపతా' అనే సినిమాను తెరకెక్కించేందుకు ఢిల్లీకి చెందిన 'మురళీ ప్రాజెక్ట్స్' అనే కంపెనీ నుండి రూ.5 కోట్ల అప్పు (లోన్) తీసుకున్నారు. అయితే, ఆ తర్వాత ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించడంలో ఆయన విఫలమయ్యారు. అప్పు తీర్చడానికి ఆయన ఇచ్చిన చెక్కులు బ్యాంకులో బౌన్స్ అయ్యాయి. దీనిపై సదరు కంపెనీ కోర్టును ఆశ్రయించడంతో సుదీర్ఘ విచారణ జరిగింది. కోర్టు వెలుపల రాజీ పడతామని గతంలో రాజ్‌పాల్ యాదవ్‌ హామీ ఇచ్చినప్పటికీ, ఆ నిబంధనలను ఆయన పాటించలేదు.

కోర్టు ఆగ్రహం.. శిక్ష ఖరారు..

చెక్ బౌన్స్ కేసుతో పాటు కోర్టుకు తప్పుడు అఫిడవిట్ సమర్పించడం, కోర్టును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయడంపై న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజ్‌పాల్ యాదవ్‌ ప్రవర్తనను తప్పుబడుతూ గతంలో మేజిస్ట్రేట్ కోర్టు విధించిన 3 నెలల జైలు శిక్షను జస్టిస్ అనిల్ కుమార్ చావ్లా నేతృత్వంలోని ఢిల్లీ హైకోర్టు బెంచ్ సమర్థించింది. చట్టం ముందు అందరూ సమానమేనని, సెలబ్రిటీ అయినంత మాత్రాన మినహాయింపులు ఉండవని కోర్టు ఈ సందర్భంగా స్పష్టం చేసింది.

Next Story