- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పొలానికి నీరు పెడుతుండగా విద్యుదాఘాతంతో రైతు మృతి
వ్యవసాయ పొలానికి నీరు పెడుతుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై మండలంలోని నిజాంపూర్ గ్రామానికి చెందిన రైతు పల్లె లక్ష్మణ్ (42) మృతి చెందాడు.

దిశ, నవీపేట్ : వ్యవసాయ పొలానికి నీరు పెడుతుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై మండలంలోని నిజాంపూర్ గ్రామానికి చెందిన రైతు పల్లె లక్ష్మణ్ (42) మృతి చెందాడు. నవీపేట్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం ఉదయం లక్ష్మణ్ తన వ్యవసాయ పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో పొలంలోని మోటారు స్టార్టర్‌కు విద్యుత్ వైర్ కనెక్షన్ ఇస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుడి భార్య పల్లె లింగమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, పంచనామా నిర్వహించిన అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా జనరల్ ఆస్పత్రికి తరలించినట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. మృతుడు లక్ష్మణ్‌కు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఆయన ఆకస్మిక మృతితో కుటుంబ సభ్యులు, గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.






