ప్రతి రైతు తప్పనిసరి రైతు రిజిస్ట్రేషన్ నమోదు చేసుకోవాలి

by Taduka Kalyani |

దేశంలో ప్రతి పౌరుడికి ఆధార్ కార్డును గుర్తింపు కల్పించినట్లుగానే ప్రతి రైతుకు 11 అంకెల విశిష్ట గుర్తింపు సంఖ్యను కేటాయించే కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలు చేస్తుందని షాబాద్ మండల వ్యవసాయ అధికారి దండెం విజయచంద్ర అన్నారు.

ప్రతి రైతు తప్పనిసరి రైతు రిజిస్ట్రేషన్ నమోదు చేసుకోవాలి
X

దిశ, షాబాద్: దేశంలో ప్రతి పౌరుడికి ఆధార్ కార్డును గుర్తింపు కల్పించినట్లుగానే ప్రతి రైతుకు 11 అంకెల విశిష్ట గుర్తింపు సంఖ్యను కేటాయించే కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలు చేస్తుందని షాబాద్ మండల వ్యవసాయ అధికారి దండెం విజయచంద్ర అన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ... వ్యవసాయ రంగాన్ని పూర్తిగా డిజిటలైజేషన్ చేయాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టు వారు వివరించారు. భూమి కలిగిన ప్రతి రైతుకు సంబంధించిన భూ యాజమాన్య వివరాలు, వ్యక్తిగత సమాచారం ఆధారంగా ఫార్మర్ రిజిస్ట్రీ రూపొందించబడుతుందని, ముఖ్యంగా పీఎం కిసాన్ పథకము తదుపరి విడుదల లబ్ధి పొందాలంటే ఫార్మర్ రిజిస్ట్రీలో నమోదు తప్పనిసరిగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసిందని తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వ పథకాలు అయినా రైతు భరోసా, రుణమాఫీ మొక్కజొన్న,పత్తి,ధాన్యం కొనుగోలు,యూరియా, ఇతర ఎరువుల బుకింగ్ యాప్ కోరకు ఫార్మర్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేసుకోవాలని రైతులకు సూచించారు. రైతులు తమ ఆధార్ కార్డు,భూ యాజమాన్య పాస్ బుక్, ఆధార్ కు అనుసంధానమైన మొబైల్ నెంబర్ తో మీ క్లస్టర్ పరిధిలో ఉన్న వ్యవసాయ విస్తరణ అధికారి లేదా సమీప మీసేవ కేంద్రాలను సంప్రదించి వెంటనే ఫార్మర్ ఐడి నమోదు ప్రక్రియను పూర్తి చేసుకోవాలని సూచించారు. ఇప్పటి వరకు షాబాద్ మండలంలో మొత్తం పట్టాదారు పాస్ బుక్ కల్గి ఉన్న రైతులు 27843 ఉండగా, 17350 రైతులు ఫార్మర్ రిజిస్ట్రేషన్ నమోదు చేసుకున్నారని ,ఇంకా 10493 మంది రైతులు రిజిస్ట్రేషన్ చేసుకోవలసి ఉందని వారందరూ త్వరగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని షాబాద్ మండల వ్యవసాయ అధికారి దండెం విజయచంద్ర అన్నారు.

Next Story