- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఈ నెల 12న రౌండ్ టేబుల్ సమావేశం
పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నట్లు రాకేష్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.

దిశ, హనుమకొండ కలెక్టరేట్: పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ గ్రాడ్యుయేట్ ఫోరం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నట్లు ఆ సంఘం అధ్యక్షులు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఏనుగుల రాకేష్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.సుమారు 11,300 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఉన్న నేపథ్యంలో అటు విద్యార్థులు, తల్లిదండ్రులు, కళాశాలల యాజమాన్యాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు విడుదల చేయడంలో తాత్సారం వహిస్తుందని, పైగా జీవో 7 తెచ్చి ఫీజు రియాంబర్స్మెంట్ ను శాశ్వతంగా మూసివేసే కుట్రకు తెలిపారని అన్నారు.ఈ నెల 12 న హన్మకొండ, హరిత హోటల్ లో జరిగే రౌండ్ టేబుల్ సమావేశంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని విద్యావంతులు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, కళాశాలల యాజమాన్యాలు, లెక్చరర్ యూనియన్ లు, విద్యార్థి సంఘాల నేతలు, ప్రజా సంఘాలు, కుల సంఘాలు, విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్దయెత్తున పాల్గొనాలని, ఈ సమావేశం ద్వారా ఓరుగల్లు నుండి రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి గట్టి హెచ్చరిక పంపాలని పిలుపునిచ్చారు.






