- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రోషన్ కనకాల న్యూ మూవీ స్టార్ట్.. సరికొత్త ఎక్స్‌పీరియన్స్ కోసం సిద్ధంగా ఉండండి అంటున్న మేకర్స్
ప్రేక్షకులకు సరికొత్త ప్రపంచాన్ని పరిచయం చేయబోతున్న ఫాంటసీ, సైన్స్ ఫిక్షన్, ప్రేమ, మిస్టరీ కలయికలో ఓ భారీ కాన్సెప్ట్ సినిమా ఘనంగా ప్రారంభమైంది.

దిశ, సినిమా: ప్రేక్షకులకు సరికొత్త ప్రపంచాన్ని పరిచయం చేయబోతున్న ఫాంటసీ, సైన్స్ ఫిక్షన్, ప్రేమ, మిస్టరీ కలయికలో ఓ భారీ కాన్సెప్ట్ సినిమా ఘనంగా ప్రారంభమైంది. రోషన్ కనకాల, గహజి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ హై-కాన్సెప్ట్ సై-ఫై ఎంటర్‌టైనర్ తాజాగా అధికారికంగా లాంచ్ అయ్యింది. ప్రముఖ దర్శకుడు విఐ ఆనంద్ వద్ద చీఫ్ అసోసియేట్ డైరెక్టర్, డైలాగ్ రైటర్‌గా ఎన్నో ఏళ్లుగా పనిచేసిన విజయ్ కె కామిశెట్టి.. ఇప్పుడు ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌తో దర్శకుడిగా టాలీవుడ్‌కు పరిచయం కాబోతున్నాడు. ఫాంటసీ, సైన్స్ ఫిక్షన్ సినిమాల స్థాయిని తన వినూత్న స్టొరీ టెల్లింగ్‌తో మార్చిన విఐ ఆనంద్ అందించిన కథ ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది. గుత్తా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై బాలాజీ గుట్ట, కౌశిక్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా కాకతీయ హిల్స్‌లోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన పూజా కార్యక్రమాలతో ఈ చిత్రం తాజాగా ఘనంగా ప్రారంభమైంది. హీరో నిఖిల్ ముహూర్తపు షాట్‌కు క్లాప్ కొట్టగా, సినిమాటోగ్రాఫర్ కెకె సెంథిల్ కుమార్ కెమెరాను స్విచ్ ఆన్ చేశారు. విఐ ఆనంద్ స్క్రిప్ట్‌ను అందించి ప్రారంభ షాట్‌కు దర్శకత్వం వహించారు. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతుండగా, రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుందని తెలిపారు మేకర్స్.






