- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రూ.5 వేల కోట్లతో ఉద్యమకారుల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి
రూ.5000 కోట్లతో ఉద్యమకారుల కార్పొరేషన్ ఏర్పాటు చేసి, సంక్షేమ పథకాలు అందించాలని తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక రాష్ట్ర చైర్మన్ గుడిమళ్ళ రవికుమార్ డిమాండ్ చేశారు.

దిశ, హనుమకొండ కలెక్టరేట్ : రూ.5000 కోట్లతో ఉద్యమకారుల కార్పొరేషన్ ఏర్పాటు చేసి, సంక్షేమ పథకాలు అందించాలని తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక రాష్ట్ర చైర్మన్ గుడిమళ్ళ రవికుమార్ డిమాండ్ చేశారు. శుక్రవారం హనుమకొండ కాకతీయ కాలనీలోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గుడిమళ్ళ రవికుమార్ మాట్లాడుతూ ఉద్యమకారుల వివరాలను నాటి ప్రభుత్వం అధికారికంగా ప్రకటించకపోవడం దురదృష్టకరమని అన్నారు. ఉద్యమకారుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం 250 గజాల ఇంటి స్థలం, ప్రతి నెల 25 వేల పెన్షన్, ఫ్రీ బస్ పాస్, ఆరోగ్య బీమా, ట్రిపుల్ బెడ్ రూమ్ ఇల్లు, విద్యా ఉద్యోగాలలో 10 శాతం రిజర్వేషన్ కల్పించాలని అన్నారు.
ఈ నెల 17న ఉమ్మడి వరంగల్ జిల్లా నుండి ఉద్యమకారుల సంక్షేమం, గుర్తింపు ప్రక్రియపై సలహాలు, సూచనలు కలిగిన వినతి పత్రాన్ని కేకే కమిటీకి అందజేస్తామని గుడిమళ్ళ రవికుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అడక్ కమిటీ సభ్యులు వొడపెల్లి శ్యామ్‌కృష్ణ, బొలిశెట్టి అశోక్, చాంద్ పాషా, మనోహర్ రావు, యం.డి. ఖదీర్, దాసరి జనార్దన్, టీన్ స్వామి, చెన్నూరి నటరాజ్, మొలంగూరి నెల్సన్, ముగుసలా దేవేందర్ రెడ్డి, మీర్జా అంజాద్, సువర్ణ లతా, గోపనబోయిన రాజు, ఐమాడిశెట్టి రాజు, యేడునురి రాజమౌళి, జక్కుల స్వామి, యాదవ్, షైక్ దస్తగిరి, మాస్క్ కరుణాకర్ కేడల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.






