విద్యార్థుల చదువుకు చేయూత

by Ratna Kumari |

ముప్కాల్ మండలం నల్లూర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు విద్యా ప్రోత్సాహకంగా రూ.80 వేల విలువైన విద్యా సామగ్రిని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ సర్పంచ్ పెండం జీవన్ కుటుంబ సభ్యులు పంపిణీ చేశారు.

విద్యార్థుల చదువుకు చేయూత
X

దిశ, ముప్కాల్ : ముప్కాల్ మండలం నల్లూర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు విద్యా ప్రోత్సాహకంగా రూ.80 వేల విలువైన విద్యా సామగ్రిని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ సర్పంచ్ పెండం జీవన్ కుటుంబ సభ్యులు శుక్రవారం పంపిణీ చేశారు. మాజీ సర్పంచ్ పెండం జీవన్, ఆయన సతీమణి సరోజా, ఆస్ట్రేలియాలో నివసిస్తున్న వారి కుమారుడు ప్రదీప్, కోడలు మేధ తమ సొంత నిధులతో ఈ విద్యా సామగ్రిని అందజేశారు. నర్సరీ నుంచి యూకేజీ వరకు చదువుతున్న చిన్నారులకు పాఠ్యపుస్తకాలు, స్కూల్ బ్యాగులు, పెన్సిళ్లు, రబ్బర్లు, షార్పనర్లు అందించగా, ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు స్కూల్ బ్యాగులు, పెన్సిల్ బాక్సులు, పెన్సిళ్లు, ఎరేజర్లు తదితర విద్యా సామగ్రిని పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా గ్రామ ప్రజలు, విద్యార్థుల తల్లిదండ్రులు దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థుల విద్యాభివృద్ధికి ఇలాంటి సేవలు ఆదర్శప్రాయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గంగాధర్, ఉపసర్పంచ్ లావణ్య, గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు బర్కం గంగాధర్, శ్రీనివాస్, వార్డు సభ్యులు ప్రవీణ్, కుమార్, పనీందర్, గౌడ్ రాజు, జీపీవో సురేష్, ప్రధానోపాధ్యాయుడు లక్ష్మణ్, ఉపాధ్యాయులు నవీన, జ్యోత్స్న, నాగరాణి, కవిత, లక్ష్మి, సౌజన్య, శ్రీజ, అటెండర్ అనుజ లింగం, అంగన్‌వాడీ సిబ్బంది ముత్తెమ్మ, పూజ, మధ్యాహ్న భోజన కార్మికులు మమత, రజిత, విద్యార్థుల తల్లిదండ్రులు శ్రీనివాస్, రాజు, సునీల్, నవకాంత్, చిన్నయ్య, వసంత్ తదితరులు పాల్గొన్నారు.

Next Story