- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చిలుకూరు ఎస్‌ఐకు విలేకరుల ఘన స్వాగతం
చిలుకూరు పోలీస్ స్టేషన్ నూతన ఎస్‌ఐగా బాధ్యతలు స్వీకరించిన బి.మోహన్‌బాబుకు మండల విలేకరులు శుక్రవారం ఆత్మీయ స్వాగతం పలికి ఘనంగా సన్మానించారు.

X
దిశ, చిలుకూరు : చిలుకూరు పోలీస్ స్టేషన్ నూతన ఎస్‌ఐగా బాధ్యతలు స్వీకరించిన బి.మోహన్‌బాబుకు మండల విలేకరులు శుక్రవారం ఆత్మీయ స్వాగతం పలికి ఘనంగా సన్మానించారు. పుష్పగుచ్ఛం అందించి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ బి.మోహన్‌బాబు మాట్లాడుతూ.. పోలీస్ స్టేషన్‌కు వచ్చే బాధితులకు సత్వర న్యాయం, సరైన సేవలు అందించడమే తమ ప్రధాన లక్ష్యమన్నారు. బాధితులకు న్యాయం జరిగితేనే పోలీసు శాఖపై ప్రజల్లో విశ్వాసం పెరుగుతుందని, పోలీసులకు మంచి గుర్తింపు లభిస్తుందని పేర్కొన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించే క్రమంలో విలేకరులు కూడా తమకు సహకరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో విలేకరులు కందుకూరి వంశీకృష్ణ, షేక్ మీరా సాహెబ్, కాంపాటి శ్రీనివాసరావు, కందుకూరి కృష్ణమూర్తి, మల్లెపంగు ఉపేందర్, ముక్క వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
Next Story






