- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పోలీస్ స్టేషన్ ముందు చిట్టెం రామ్మోహన్ రెడ్డి ధర్నా
by velandi.Saikiran |
మక్తల్ పోలీస్ స్టేషన్ ముందు శుక్రవారం మధ్యాహ్నం మాజీ ఎమ్మెల్యే చిట్టెం రాం మ్మోహన్ రెడ్డి కార్యకర్తలతో ధర్నా చేశారు.

X
దిశ, మక్తల్: మారణాయుధాలతో దాడి చేసిన వారందరిని అరెస్టు చేయాలని మక్తల్ పోలీస్ స్టేషన్ ముందు శుక్రవారం మధ్యాహ్నం మాజీ ఎమ్మెల్యే చిట్టెం రాం మ్మోహన్ రెడ్డి కార్యకర్తలతో ధర్నా చేశారు. బాధితుడు భద్ర తనపై దాడి చేసిన వారి పేర్లను వాంగ్మూలంలో చెప్పాడన్నారు. వారందరికీ 16 ఏళ్ల కఠిన కఠిన శిక్ష పడాలా సెక్షన్లపై నమోదు చేయాలని నినాదాలు చేస్తూ పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేశారు.
వివరాల్లోకెళ్తే ఇటీవల ఉప్పరపల్లిలో జరిగిన ఉత్సవాల్లో రెండు వర్గాల మధ్య గొడవ చోటు చేసుకుంది. ఈ సంఘటనలో కాంగ్రెస్ వర్గీయులు మరణాయుధాలతో దాడి చేయడంతో భద్ర తీవ్రంగా గాయపడ్డారని చిట్టెం రాం మ్మోహన్ రెడ్డి తెలిపారు. తమ కార్యకర్తలపై దాడి చేసిన కాంగ్రెస్ వారిపై కేసులను నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ కార్యకర్తలతో పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేశారు.
Next Story






