- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆలూర్‌లో ఎస్‌ఐఆర్ ప్రక్రియ వేగవంతం
ఆలూర్ మండలంలోని ఆలూర్, గగుపల్లి, రామచంద్రపల్లి, గుత్ప గ్రామాల్లో కొనసాగుతున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియను తహసీల్దార్ రమేష్ శుక్రవారం పరిశీలించారు.

దిశ, ఆలూర్ : ఆలూర్ మండలంలోని ఆలూర్, గగుపల్లి, రామచంద్రపల్లి, గుత్ప గ్రామాల్లో కొనసాగుతున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియను తహసీల్దార్ రమేష్ శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లను తనిఖీ చేసి, బీఎల్‌వోలు నిర్వహిస్తున్న నమోదు ప్రక్రియపై ఆరా తీశారు.
ఈ సందర్భంగా తహసీల్దార్ రమేష్ మాట్లాడుతూ.. ఎస్‌ఐఆర్‌కు సంబంధించిన దరఖాస్తు ఫారాలను ఈ శని, ఆదివారాల్లో సంబంధిత బీఎల్‌వోలకు అందజేయాలని సూచించారు. ప్రజల సౌకర్యార్థం ప్రతి గ్రామంలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అర్హులైన ఓటర్లందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ వివరాలను నమోదు చేసుకోవాలని కోరారు.
రెండో శని, ఆదివారాల్లో కూడా ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి ఫారాల స్వీకరణ కొనసాగుతుందని తెలిపారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియను వంద శాతం పూర్తి చేయడంలో బీఎల్‌ఏ ఏజెంట్లు, బీఎల్‌వోలు, అధికారులు, ప్రజలు సమన్వయంతో సహకరించాలని కోరారు. ప్రతి అర్హ ఓటరు పేరు ఓటరు జాబితాలో నమోదయ్యేలా అందరూ బాధ్యతగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జీపీఓ అజయ్, సప్తగిరి, గ్రామ పంచాయతీ కార్యదర్శి సంతోష్ తదితరులు పాల్గొన్నారు.






