- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నటుడు ప్రకాశ్ రాజ్‌పై కేసు పెట్టాల్సిందే: బీజేపీ నేత దిలీప్ డిమాండ్
సినీ నటుడు ప్రకాశ్ రాజ్ తీరుపై అసహనం భారీగా వ్యక్తమవుతోంది. ప్రశ్న రావణ్‌కు మద్దతుగా మాట్లాడటంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే టీడీపీ, జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు ఏపీ బీజేపీ నేతలు సైతం మండిపడుతున్నారు...

దిశ, వెబ్ డెస్క్: సినీ నటుడు ప్రకాశ్ రాజ్ తీరుపై అసహనం భారీగా వ్యక్తమవుతోంది. ప్రశ్న రావణ్‌కు మద్దతుగా మాట్లాడటంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే టీడీపీ, జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు ఏపీ బీజేపీ నేతలు సైతం మండిపడుతున్నారు. కేసు నమోదు చేయాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, హిందువుల మనోభావాలు దెబ్బ తీసేలా రావణ్ మాట్లాడటంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రావణ్‌ను సమర్థిస్తూ మాట్లాడిన ప్రకాశ్ రాజ్‌పై కేసు పెట్టాల్సిందేనని రాష్ట్ర బీజేపీ నేత దిలీప్ డిమాండ్ చేశారు. రావణ్ పై ఉపా కేసు సబబని ఆయన తెలిపారు. రావణ్ చేసిన వ్యాఖ్యలను సనాతన ధర్మంపై చేసినవిగానే తాము భావిస్తున్నామన్నారు. రావణ్ ను దేశద్రోహి అనడానికి ఎలాంటి సందేహం లేదని చెప్పారు. రావణ్‌కు ప్రకాశ్ రాజ్ సహకరిస్తున్నారని, అయనపైనా కేసు నమోదు చేయాలని నిలదీశారు.






