- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీగా బంగారం మాయం.. గోల్డ్ అప్రైజర్ అరెస్ట్
ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం బ్యాంక్ ఆఫ్ బరోడా శాఖలో భారీగా బంగారం మాయం అయిన విషయం తెలిసిందే. బ్యాంకు మేనేజర్ ఫిర్యాదుతో పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేసి కేసును ఛేదించారు...

దిశ, వెబ్ డెస్క్: ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం బ్యాంక్ ఆఫ్ బరోడా శాఖ(Jangareddygudem Bank of Baroda Branch)లో భారీగా బంగారం మాయం(Gold missing) అయిన విషయం తెలిసిందే. బ్యాంకు మేనేజర్ ఫిర్యాదుతో పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేసి కేసును ఛేదించారు. బ్యాంకులో పని చేసే బంగారం అప్రైజర్ చలాపాక రాజునే నిందితుడిగా తేల్చారు. అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో అసలు నిజాలు బయటకు వచ్చాయి. అంతేకాదు నిందితుడి నుంచి రూ.5.71 కోట్ల విలువైన 4.12 కిలోల బంగారు ఆభరణాలు, రూ. 10 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. బంగారం మాయం వల్ల 176 కుటుంబాలు నష్టపోయినట్లు పోలీసులు గుర్తించారు. గోల్డ్ అప్రైజర్ రాజు మొత్తం 6.44 కిలో బంగారం ఆభరణాలు మాయం చేసినట్లు తెలిపారు. దాదాపు రూ.10 కోట్ల విలువైన ఆస్తి దుర్వినియోగం అయినట్లు పోలీసులు పేర్కొన్నారు.
బంగారం బరువు తక్కువగా చూపి..
వినియోగదారులు గోల్డ్ లోన్ తీసుకునే సమయంలో బ్యాంకు రికార్డులో బంగారం బరువును తక్కువగా రాసినట్లు పోలీసులు చెప్పారు. అంతేకాకుండా అసలు ఆభరణాల స్థానంలో ఇతర అభరణాలు ఉంచి మోసం చేశారని వెల్లడించారు. అలాగే బ్యాంకు లాకర్ లో నకిలీ బంగారం, పిన్నులు ఉంచినట్లు స్పష్టం చేవారు. మిగిలిన నగల రికవరీ, ఇతరుల ప్రమేయంపై దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్పీ శివకిషోర్ తెలిపారు. అంతేకాదు మొత్తం బంగారాన్ని రికవరీ చేసి బాధితులకు న్యాయం చేస్తామని ఆయన తెలిపారు.






