డ్వాక్రా మహిళలకు బంపర్ ఆఫర్.. వడ్డీ లేని రుణాలపై డిప్యూటీ సీఎం భట్టి కీలక ప్రకటన

by Gantepaka Srikanth |

ఖమ్మం జిల్లా చింతకాని మండలం జగన్నాథపురంలో మె మంత్రి తుమ్మల నాగేశ్వర రావుతో కలిసి మెగా రైతు మేళాను ప్రారంభించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు.

డ్వాక్రా మహిళలకు బంపర్ ఆఫర్.. వడ్డీ లేని రుణాలపై డిప్యూటీ సీఎం భట్టి కీలక ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: ఖమ్మం జిల్లా చింతకాని మండలం జగన్నాథపురంలో మె మంత్రి తుమ్మల నాగేశ్వర రావుతో కలిసి మెగా రైతు మేళాను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతు సంక్షేమం, వ్యవసాయాభివృద్ధే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. రైతుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని సాగునీరు, ధాన్యం కొనుగోలు, వ్యవసాయ యాంత్రీకరణ, మార్క్‌ఫెడ్ కార్యకలాపాల బలోపేతానికి ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు వెచ్చిస్తోందని పేర్కొన్నారు. రైతుల ఆదాయం పెంచి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం చేశారు. రైతు భరోసా కింద కేవలం తొమ్మిది రోజుల్లోనే రూ.9,000 కోట్లను రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమేనని అన్నారు. ధాన్యం, మొక్కజొన్న, జొన్నల కొనుగోలు ద్వారా రైతులను అన్ని విధాలా ఆదుకున్నామని తెలిపారు. మాటలతో కాదు.. చేతలతో రైతు సంక్షేమాన్ని నిరూపిస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమని పేర్కొన్నారు. దశాబ్దాల క్రితం కాంగ్రెస్ నిర్మించిన సాగునీటి ప్రాజెక్టులు నేటికీ రైతులకు నీరందిస్తున్నాయని, రైతుల సంక్షేమానికి శాశ్వత పరిష్కారాలే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. రైతే దేశానికి వెన్నెముక అని, ఆ వెన్నెముకను మరింత బలోపేతం చేయడానికే కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని భట్టి విక్రమార్క తెలిపారు.

‘మహిళల్ని ఆర్థికంగా అభివృద్ధి పథంలో నడిపించడమే ప్రభుత్వ లక్ష్యం. 9 రోజుల్లో రూ.9వేల కోట్లు రైతుల ఖాతాలో వేశాం. గత ప్రభుత్వం రైతుబంధు కింద ఎకరాకు రూ.5వేలే ఇచ్చేది. గత ప్రభుత్వం రైతుబంధు డబ్బులు జమ చేసేందుకు 160 రోజులు పట్టేది. గత ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు ఎగ్గొట్టిన వడ్డీలేని రుణాలను కూడా అందిస్తున్నాం. మా ప్రభుత్వ హయాంలో మహిళలకు రూ.లక్ష కోట్ల రుణాలు ఇస్తాం. ఇప్పటికే మహిళలకు రూ.67 వేల కోట్లు వడ్డీ లేని రుణాలు ఇచ్చాం. మహిళలకు ఇచ్చే వడ్డీ లేని రుణాల పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచాం’ అని డిప్యూటీ సీఎం భట్టి స్పష్టం తెలిపారు.

Next Story