'పిల్ల జమిందార్' దర్శకుడిపై చీటింగ్ కేసు..?

by Malleboina Mahesh |   (  Updated:2026-07-10 12:47:05  IST  )

హీరోగా పరిచయం చేస్తానని రూ.3.5 కోట్లు మోసం చేసిన ‘పిల్ల జమిందార్’ దర్శకుడు అశోక్ బాబు.. సైబరాబాద్ EOW కేసు నమోదు!

పిల్ల జమిందార్ దర్శకుడిపై చీటింగ్ కేసు..?
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్‌లో ‘పిల్ల జమిందార్’, ‘రన్ రాజా రన్’ వంటి సూపర్ హిట్ చిత్రాలను నిర్మించి, దర్శకత్వం వహించిన ప్రముఖ సినీ దర్శకుడు గుడ్లూరి అశోక్ బాబుపై చీటింగ్ కేసు నమోదు అయినట్లు తెలుస్తుంది. ఒక యువకుడిని టాలీవుడ్‌లో హీరోగా పరిచయం చేస్తానంటూ నమ్మబలికి, సదరు యువకుడి తల్లిదండ్రుల నుంచి ఏకంగా రూ.3.5 కోట్లు వసూలు చేసి మోసగించినట్లు ఆయనపై ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

బెదిరింపుల కారణంగా రంగంలోకి ఈఓ డబ్ల్యూ (EOW)

తాజా సమాచారం ప్రకారం.. బాధితుల నుంచి భారీ మొత్తంలో డబ్బు తీసుకున్న తర్వాత అశోక్ బాబు సినిమా తీయకుండా కాలయాపన చేస్తున్నారు. తీరా హీరోగా పరిచయం చేయకపోవడంతో, బాధితులు తమ డబ్బును తిరిగి ఇవ్వాలని యువకుడి తల్లిదండ్రులు ఒత్తిడి తెచ్చారు. అయితే తీసుకున్న రూ.3.5 కోట్లు తిరిగి ఇవ్వకపోగా, వారిని బెదిరించినట్లు సమాచారం. దీంతో మోసపోయామని గ్రహించిన యువకుడి తల్లిదండ్రులు సైబరాబాద్ పోలీసులను ఆశ్రయించినట్లు తెలుస్తుంది. ఈ భారీ మోసంపై రంగంలోకి దిగిన సైబరాబాద్ ఆర్థిక నేరాల విభాగం (EOW) పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కుంభకోణంలో భాగస్వామ్యం ఉందనే అనుమానంతో నిర్మాత విజయలక్ష్మి తో పాటు, దర్శకుడు గుడ్లూరి అశోక్ బాబులను పోలీసులు ప్రస్తుతం అదుపులోకి తీసుకుని ముమ్మరంగా విచారిస్తున్నట్లు తెలుస్తుండగా.. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story