- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆర్టీసీ బస్సును ఢీకొన్న బైక్.. వృద్ధ దంపతులకు తీవ్ర గాయాలు
by Taduka Kalyani |
ఆర్టీసీ బస్సును బైక్ ఢీకొనడంతో వృద్ధ దంపతులకు తీవ్ర గాయాలైన సంఘటన నర్సాపూర్ పట్టణంలో శుక్రవారం చోటు చేసుకుంది.

X
దిశ,నర్సాపూర్ : ఆర్టీసీ బస్సును బైక్ ఢీకొనడంతో వృద్ధ దంపతులకు తీవ్ర గాయాలైన సంఘటన నర్సాపూర్ పట్టణంలో శుక్రవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే శివంపేట మండలం రత్నాపూర్ కు చెందిన వృద్ధ దంపతులు ద్విచక్ర వాహనంపై నర్సాపూర్ కు బయలుదేరారు. మార్గంమధ్యలో నర్సాపూర్ నుంచి గజ్వేల్ వెళ్తున్న ఆర్టీసీ బస్సును వీరిద్దరూ ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనం అదుపుతప్పి ఢీకొంది. బస్సు డ్రైవర్ సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ ప్రమాదంలో వృద్ధ దంపతులకు తీవ్ర గాయాలయ్యాయి. అదే సమయంలో ఆ మార్గంలో వెళుతున్న పిఎసిఎస్ చైర్మన్ రాజు యాదవ్ తన వాహనంలో క్షతగాత్రులను నర్సాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, మానవత్వం చాటుకున్నారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కు తరలించారు.
Next Story






