నులి పురుగుల నివారణ దినోత్సవాన్ని విజయవంతం చేయాలి

by velandi.Saikiran |

ఈ నెల 13 న నిర్వహించే జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవాన్ని విజయవంత చేయాలని జిల్లా శిశు ఆరోగ్యము, వ్యాధి నిరోధక టీకాల నియంత్రణాధికారి డాక్టర్. నాగ ఆనేష్ అన్నారు.

నులి పురుగుల నివారణ దినోత్సవాన్ని విజయవంతం చేయాలి
X

దిశ, ములుగు జిల్లా ప్రతినిధి : ఈ నెల 13 న నిర్వహించే జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవాన్ని విజయవంత చేయాలని జిల్లా శిశు ఆరోగ్యము, వ్యాధి నిరోధక టీకాల నియంత్రణాధికారి డాక్టర్. నాగ ఆనేష్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజారోగ్యం కుటుంబ సంక్షేమం , కమిషనర్ ఆదేశం మేరకు జూలై 13న తేదీన జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ,జూలై 20వ న మా -అప్" కార్యక్రమంగా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో 1- 19 సంవత్సరాల వయసు గల పిల్లలకు నులిపురుగుల నిర్మూలనకై ఆల్బెండజోల్ టాబ్లెట్లను ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు పంపిణీ చేస్తున్నామని,ములుగు జిల్లాలో 73,444 మంది పిల్లలు ఉన్నారని వివరించారు.

జిల్లాలోని 611 అంగన్వాడి కేంద్రాలలో, 514 ప్రభుత్వ, ప్రైవేటు- ప్రైమరీ అప్పర్ ప్రైమరీ ఉన్నత పాఠశాలలు, జూనియర్ కళాశాలలో, ఆల్బెండజోల్ టాబ్లెట్లను అందిస్తున్నామని, వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది ఆయా పాఠశాలల్లో వెళ్లి వీటిని అందిస్తారని అన్నారు. నేల కాలుష్యం వల్ల నులి పురుగులు వ్యాప్తి చెంది అవి పిల్లల లో చిన్న ప్రేగులలో స్థావరం నేర్పరచుకొని, శరీరానికి ఉపయోగపడే పోషక పదార్థాలను తినడం మూలంగా పిల్లలలో శరీర పెరుగుదల ,మానసిక ఎదుగుదల ఆగిపోతుందని , పిల్లలలో రక్తహీనత ఏర్పడి పిల్లలు అనారోగ్యానికి గురవుతారని అన్నారు. కార్యక్రమంలో సంబంధిత అధికారు లు పాల్గొని వారు.

Next Story