100 పడకల ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత

by velandi.Saikiran |

చొప్పదండి పట్టణంలో 100 పడకల ఆసుపత్రి వద్ద శుక్రవారం ఉద్రిక్తత చోటు చేసుకుంది.

100 పడకల ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత
X

దిశ, చొప్పదండి: చొప్పదండి పట్టణంలో 100 పడకల ఆసుపత్రి వద్ద శుక్రవారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీఆర్ఎస్ నాయకులుతో కలసి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఆసుపత్రిని సందర్శించారు. ఈ నేపథ్యంలో ఆసుపత్రి గేట్ దూకి లోనికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ప్రజల కోసం కట్టిన ఆసుపత్రిని సందర్శిస్తే పోలీసులు అడ్డుకోవడం ఏమిటని మాజీ ఎమ్మెల్యే ప్రశ్నించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి రెండేళ్లు గడిచినా ప్రారంభించక పోవడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇది మా ప్రభుత్వ హయాంలో ప్రజల కోసం నిర్మించిన ప్రభుత్వ ఆసుపత్రని చూసే హక్కు కూడా మాకు లేదా..అని ప్రశ్నించారు. వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావడానికి ఆసుపత్రిని వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా మాజీ ఎమ్మెల్యే రవిశంకర్ ను పోలీసులు అరెస్ట్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు.

Next Story